News April 30, 2024

మే 2న ‘హరిహర వీరమల్లు’ టీజర్

image

పవన్ కళ్యాణ్-క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను మే 2న ఉదయం 9 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్ వీరోచిత బందిపోటుగా కనిపించనున్నట్లు సమాచారం. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Similar News

News March 15, 2026

మార్చి15: చరిత్రలో ఈరోజు

image

*1564: జిజియా పన్ను రద్దు
*1934: BSP స్థాపకుడు కాన్షీరాం జననం(ఫొటోలో)
*1937: తెలుగు సాహితీ విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య జననం
*1950: ప్రణాళికా సంఘం ఏర్పాటు
*1977: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జననం
*1993: బాలీవుడ్ నటి ఆలియా భట్ జననం
*ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం

News March 15, 2026

రప్పా రప్పా అంటే ఈ సీట్లు కూడా రావు: నాగబాబు

image

AP: రప్పా రప్పా అంటే వైసీపీకి ఇప్పుడున్న సీట్లు కూడా రావని జనసేన MLC నాగబాబు ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడం ఖాయమని అన్నారు. తిరుమల లడ్డూలో కెమికల్స్ కలిపిన దుర్మార్గపు పార్టీ YCP అని, హిందూ మతాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఓడిపోయినా ఆ పార్టీకి బుద్ధి రాలేదని మండిపడ్డారు. శ్రీకాకుళం(D) లావేరులో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.