News February 14, 2026
పరిశ్రమలకు అనుమతుల్లో జాప్యం వద్దు: VZM కలెక్టర్

పరిశ్రమల స్థాపనకు వచ్చే దరఖాస్తులను నిబంధనల ప్రకారం అత్యంత వేగంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్న అనంతరం చట్టబద్ధమైన గడువు ముగిసే వరకు వేచి చూడకుండా, వెంటనే దరఖాస్తులను పరిశీలించి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని స్పష్టం చేశారు.
Similar News
News April 17, 2026
ప్రతీ ఇంటినుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలి: VZM కలెక్టర్

ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక మహారాజా కోటలో శుక్రవారం ప్రారంభమైన రెండురోజుల వెండార్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఈ అవకాశాన్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ లఘు ఉద్యోగ్ భారత్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సీఐటీడీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
News April 17, 2026
VZM: స్వయంగా స్వీయ గణన పూర్తి చేసిన కలెక్టర్

జనగణన-2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి స్వీయ గణన ప్రక్రియను గురువారం పూర్తి చేశారు. ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సౌకర్యం ద్వారా ప్రజలు అధికారిక వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్, ఓటీపీ ద్వారా లాగిన్ అయి కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేయాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సచివాలయ సిబ్బంది సహాయం తీసుకోవాలని అన్నారు.