News February 14, 2026

TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు

image

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్‌తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.

Similar News

News April 18, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.

News April 18, 2026

చరిత్రకు సజీవ సాక్ష్యం మెదక్ ఖిల్లా

image

మెదక్‌లో చారిత్రక కీర్తిని చాటుతూ నిలిచిన మెదక్ ఖిల్లా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కోట కాకతీయుల కాలంలో నిర్మాణం చెంది, అనంతరం కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు అభివృద్ధి చేశారు. బలమైన గోడలు, అద్భుత నిర్మాణ శైలి ఖిల్లా వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పైభాగం నుంచి కనిపించే ప్రకృతి అందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రాంత చరిత్రను గుర్తు చేస్తూ వారసత్వ చిహ్నంగా ఇది నిలిచింది.

News April 18, 2026

చారిత్రకు ఆనవాళ్లు జోగిపేట కోట !

image

సంగారెడ్డి(D) జోగిపేట కోట నిజాం కాలం వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతం నిజాం పాలనలోకి వచ్చాక పరిపాలన, రక్షణ అవసరాల కోసం ఈ కోటను ఉపయోగించారు. ఇక్కడి ఇండో-ఇస్లామిక్ శైలి కట్టడాలు, గడిలు నాటి గొప్పతనాన్ని చాటుతున్నాయి. చారిత్రక ఆంధ్ర మహాసభలకు వేదికైన ఈ కోట, తెలంగాణ సాయుధ పోరాట కాలంలోనూ కీలక పాత్ర పోషించింది. ఇక్కడ నిర్మించిన క్లాక్ టవర్‌కు సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది.