News February 14, 2026

TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు

image

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్‌తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.

Similar News

News April 16, 2026

మారేడుమిల్లి: అడవి దున్న దాడి.. వ్యక్తి మృతి

image

మారేడుమిల్లి మండలం ఉత్తలూరు గ్రామానికి చెందిన ఆదిరెడ్డి(42) గురువారం గొర్రగేదె (అడవి దున్న) దాడిలో మృతి చెందాడని సీఐ ప్రసాద్ తెలిపారు. కొండ సమీపంలో తన జఫ్రా తోటలో పని చేస్తుండగా అడవి దున్న దాడి చేయడంతో స్పాట్‌లోనే మృతి చెందాడని చెప్పారు. సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. మారేడుమిల్లి మండలంలో గొర్రగేదెలు మందలుగా సంచారిస్తున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరించారు.

News April 16, 2026

సింహాచలంలో రేపు ఆర్జిత సేవలు బంద్

image

సింహాచలంలో శుక్రవారం ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గంధం అమావాస్య సందర్భంగా.. గురువారం సాయంత్రం నుంచే పుష్కరణి దగ్గర స్నానాలు చేసి శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

News April 16, 2026

ఖమ్మం: జావేద్ మృతికి రాహుల్ గాంధీ సంతాపం

image

ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ జావేద్ అకాల మృతి పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన నిబద్ధత గల నాయకుడు అని, ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీ గుర్తించుకుంటుందని అన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. జావేద్ మృతి పట్ల ఇప్పటికే అటు రాష్ట్ర మంత్రులు, ఇటు స్థానిక నేతలు సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.