News February 14, 2026
TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్‌తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.
Similar News
News April 19, 2026
SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్లు: మంత్రి

AP: పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా SC, STలకు ఉచితంగా సోలార్ విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, ఇతరులకు 40% రాయితీతో పంపిణీ చేస్తామన్నారు. ఈ స్కీమ్ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల భారం తగ్గించవచ్చని, అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్‌ను ప్రభుత్వానికి అమ్మవచ్చని వివరించారు.
News April 19, 2026
పరిష్కార వేదిక సమయంలో మార్పులు: DRO

ఒంగోలులో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిర్వహిస్తామని DRO ఓబులేసు ప్రకటించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌కు అర్జీలు సమర్పించేవారు ఈ సమయంలోనే ఇచ్చి 12.30 గంటలకల్లా తిరిగి నివాసగృహాలకు చేరుకోవాలని సూచించారు.
News April 19, 2026
సైబర్ మోసగాళ్లపట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జనగణన పేరుతో సైబర్ మోసగాళ్లు చేసే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అన్నారు. జనగణన సిబ్బంది అంటూ ఇంటికి వచ్చి ఫోన్, ఓటీపీలు అడిగితే చెప్పవద్దని హెచ్చరించారు. జనాభాను లెక్కించేందుకు సిబ్బంది ఫోన్ నంబర్లు, వ్యక్తిగత వివరాలు అడగరని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కోరారు.


