News February 14, 2026

TU: పూణే ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు

image

పూణేలోని సావిత్రిబాయి విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి ఎన్ఎస్ఎస్ క్యాంప్‌లో టీయూ విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రదర్శించి ప్రశంసలు పొందారు. యోగా, మెడిటేషన్‌తో ప్రారంభమైన జాతీయస్థాయి క్యాంపులో మానసిక అవగాహన, వ్యసన వ్యతిరేక ప్రచారం, సంప్రదాయ క్రీడలు, బతుకమ్మ పండుగ తదితర అంశాలపై చక్కని ప్రదర్శన ఇవ్వడం పట్ల విద్యార్థుల ప్రతిభను ప్రశంసించినట్లు టీయూ కోఆర్డినేటర్ అపర్ణ తెలిపారు.

Similar News

News April 16, 2026

భర్త మరణం తట్టుకోలేక.. భార్య కన్నుమూత

image

కృష్ణాజిల్లా గూడూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది. కప్పలదొడ్డికి చెందిన తిరుమలశెట్టి వీర రాఘవరావు (66) అనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం మృతి చెందారు. భర్త మరణాన్ని తట్టుకోలేక భార్య పద్మావతి (61) కొద్దిసేపటికే స్పృహ కోల్పోయారు. ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆమె కూడా ప్రాణాలు విడిచారు. గంటల వ్యవధిలోనే దంపతులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News April 16, 2026

HYD, RR జిల్లాలో చనిపోయిన వారికి రేషన్ బియ్యం

image

ఉమ్మడి HYD, RR జిల్లాల్లో మరణించిన వ్యక్తుల పేర్లపైనా బియ్యం సరఫరా అవుతుండం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. CAG ఇటీవల హెచ్చరిక జారీ చేస్తూ, పన్నులు చెల్లించే వారు, అధిక భూములు కలిగినవారు లబ్ధి పొందుతున్నారని వెల్లడించింది. చనిపోయిన వారి పేర్ల మీద సైతం రేషన్ బియ్యం పంపిణీ జరుగుతున్నట్లుగా తెల్చింది. అర్హతలేని వారికి రేషన్ అందుతుండటంపై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణుల మాట.

News April 16, 2026

ప.గో: సహాయం చేయండి.. బహుమతి పొందండి

image

రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకునే ‘పీఎం-రాహత్’ పథకంపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. గాయపడిన వారికి రూ. 1.50 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని బుధవారం తెలిపారు. బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చే వారికి రూ.25 వేల నగదు పురస్కారం అందజేస్తామన్నారు. విలువైన ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని ఆమె పిలుపునిచ్చారు.