News May 1, 2024
నా ఒక్క ఓటే కదా.. అనుకోవద్దు
కొందరు ఓటు వేసేందుకు ఆసక్తి చూపరు. నా ఒక్క ఓటే కదా.. వేయకపోతే ఏమవుతుందిలే అనుకుంటారు. కానీ ఆ ఒక్క ఓటే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించగలదు. అనర్హులు ప్రజాప్రతినిధులుగా అందలమెక్కుతారు. ఓటు వేయకుంటే ప్రశ్నించే తత్వం కోల్పోతారు. ధైర్యంగా ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులతో పోరాడలేరు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోయినట్లే. అభ్యర్థుల పనితీరు నచ్చకపోతే నోటాకు ఓటేయొచ్చు. అందరూ బాధ్యతతో ఓటు వేయాలి.
Similar News
News January 1, 2025
ఐదో టెస్టుకు ఆస్ట్రేలియా జెర్సీ ఇదే
IND, AUS మధ్య ఐదో టెస్ట్ (పింక్ టెస్ట్) ఈనెల 3 నుంచి జరగనుంది. ఈ మ్యాచుకు స్టేడియం మొత్తం పింక్ కలర్‌లో దర్శనమివ్వనుంది. AUS ప్లేయర్లు సైతం పింక్ క్యాప్స్ ధరిస్తారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ మెక్‌గ్రాత్ ఫౌండేషన్‌కు మద్దతుగా 2009 నుంచి పింక్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. 2008లో తన భార్య క్యాన్సర్‌తో చనిపోవడంతో మెక్‌గ్రాత్ ఫౌండేషన్ స్థాపించి క్యాన్సర్ రోగుల కోసం ఫండ్స్ సేకరిస్తున్నారు.
News January 1, 2025
తగ్గిన సిలిండర్ ధర
కొత్త ఏడాదిలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. రూ.14.50 తగ్గడంతో ఢిల్లీలో గ్యాస్ ధర రూ.1804కు చేరింది. ప్రస్తుతం HYDలో సిలిండర్ ధర రూ.2014గా ఉంది. ఇవాళ్టి నుంచి ఈ ధరలు అమల్లోకి వచ్చాయి. మరోవైపు 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. కాగా ప్రతినెల ఒకటో తేదీన సిలిండర్ ధరల్లో ఆయిల్ కంపెనీలు మార్పులు చేస్తాయి.
News January 1, 2025
2025లో ప్రపంచయుద్ధం?
నోస్ట్రడామస్, బాబా వంగా ఇద్దరూ ఎన్నో ఏళ్ల ముందుగానే పలు ఘటనల్ని కచ్చితత్వంతో అంచనా వేశారు. 2025 గురించి వీరు చెప్పిన జోస్యం పాశ్చాత్య దేశాల ప్రజల్ని భయపెడుతోంది. ఈ ఏడాది ఐరోపాలో ప్రపంచయుద్ధం స్థాయిలో పరిస్థితులు నెలకొంటాయని వారు చెప్పారు. బ్రిటన్‌లో మహమ్మారి తిరిగి వస్తుందని, USలో ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అన్నారు. ప్రపంచ ఆధిపత్యం తూర్పుదేశాల చేతికి వస్తుందని జోస్యం చెప్పారు.