News May 1, 2024
‘పుష్ప-2’ నుంచి మరో పోస్టర్
హీరో అల్లు అర్జున్ ‘పుష్ప-2’ మూవీ నుంచి మేకర్స్ మరో పోస్టర్ విడుదల చేశారు. ఎర్రచందనం దుంగల మధ్య నిలబడ్డ అల్లు అర్జున్ మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ మూవీ నుంచి మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సుకతను పెంచుతున్నారు. ఇక ‘పుష్ప పుష్ప’ అంటూ సాగే పాట ఇవాళ సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఈ సాంగ్ సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తుందని మేకర్స్ చెబుతున్నారు.
Similar News
News January 1, 2025
బుమ్రాను ఊరిస్తున్న మరో రికార్డు
AUSతో జరిగే ఐదో టెస్టులో 3 వికెట్లు తీస్తే బుమ్రా ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. BGT చరిత్రలో సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఆయన నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు హర్భజన్ (32 వికెట్లు, 2000-01 సిరీస్) పేరిట ఉంది. ప్రస్తుత సిరీస్‌లో బుమ్రా ఇప్పటివరకు 30W తీశారు. ఆయన ఇంత గొప్పగా రాణిస్తున్నా ఇతర బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్ల నుంచి మంచి ప్రదర్శన రాకపోవడం జట్టును కలవరపెడుతోంది.
News January 1, 2025
పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు
AP: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మ. 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ్టి విచారణకు ఆమె హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
News January 1, 2025
న్యూ ఇయర్ రోజున తీవ్ర విషాదం
న్యూ ఇయర్ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపాయి. జగిత్యాల(D) ధర్మపురిలో చర్చి నుంచి బైక్‌పై ఇంటికెళ్తున్న దంపతులను కారు ఢీకొట్టడంతో స్పాట్‌లో చనిపోయారు. మంచిర్యాల(D) దండేపల్లి KGBV వద్ద బైక్ అదుపు తప్పి ఇద్దరు యువకులు, ASF(D) బెజ్జూర్‌లో పొలాల్లోకి బైక్ దూసుకెళ్లి ఇద్దరు మృతి చెందారు. అటు ఏపీలోని జమ్మలమడుగు(మ) చిటిమిటి చింతల వద్ద డివైడర్‌ను కారు ఢీకొని ఇద్దరు ప్రాణాలు విడిచారు.