News January 1, 2025

పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు

image

AP: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మ. 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ్టి విచారణకు ఆమె హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Similar News

News January 16, 2025

ఈ ఏడాది 90 కోట్లకు ఇంటర్నెట్ యూజర్లు

image

దేశవ్యాప్తంగా 2024లో 88.6Cr ఉన్న ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఈ ఏడాదిలో 90Crకు చేరుకుంటుందని ఓ రిపోర్టు వెల్లడించింది. మొత్తం వినియోగదారుల్లో 55%(48.8Cr) గ్రామీణ ప్రాంతాల ప్రజలే ఉంటారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(IAMAI) తెలిపింది. 98% మంది IND భాషల్లోనే నెట్‌ను యూజ్ చేశారంది. తెలుగు, తమిళ్, మలయాళం వంటి భాషల్లో కంటెంట్ విస్తృతంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజాధరణ లభిస్తోందని పేర్కొంది.

News January 16, 2025

చరిత్ర సృష్టించిన ప్రతిక

image

IND-W జట్టు ఓపెనర్ ప్రతికా రావల్ వన్డేల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు. ఆడిన తొలి 6 ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్స్(444) సాధించిన ప్లేయర్‌గా నిలిచారు. ప్రతిక తర్వాతి స్థానాల్లో చార్లెట్ ఎడ్వర్డ్స్(ENG)-434, నథాకన్(థాయ్‌లాండ్)-322, ఎనిడ్ బేక్‌వెల్(ENG)-316, నికోలే బోల్టన్(ఆస్ట్రేలియా)-307 ఉన్నారు. కాగా ప్రతిక సైకాలజీలో డిగ్రీ చేశారు. తండ్రి ప్రదీప్ దేశవాళీ టోర్నీల్లో అంపైర్.

News January 16, 2025

సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం: CBN

image

AP: గత ప్రభుత్వం అమరావతిని భ్రష్టుపట్టించిందని, పోలవరాన్ని గోదావరిలో కలిపిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘రాష్ట్రంలో స్థానికులు పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడే పరిస్థితి తెచ్చారు. మేం పెట్టుబడులు తెచ్చి, అభివృద్ధి చేసి చూపిస్తాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికం నిర్మూలించవచ్చు. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్-2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని వెల్లడించారు.