News May 1, 2024
ఎవరి అధీనంలో ఏ కంపెనీలు అంటే..

గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ (GIG) పరిధిలో గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, గోద్రేజ్ ఆగ్రోవెట్, ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ సంస్థలు వస్తాయి. GIGకి నాదిర్ ఛైర్మన్‌గా ఉంటారు. నాదిర్ కజిన్ జమ్‌షెద్ గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌కు (GEG) ఛైర్మన్‌గా ఉంటారు. GEG పరిధిలో డిఫెన్స్, ఏవియేషన్, నిర్మాణం, IT, ఫర్నీచర్, ఎనర్జీ, ఇంజిన్స్ & మోటార్స్ మొదలైన వ్యాపారాలు ఉన్నాయి.
Similar News
News March 12, 2026
టెస్ట్ క్రికెట్‌లో బుమ్రా కొనసాగడం కష్టమే: మెక్‌గ్రాత్

భారత పేసర్ బుమ్రా టెస్ట్ భవిష్యత్తుపై AUS దిగ్గజ బౌలర్ మెక్‌గ్రాత్ ఆందోళన వ్యక్తం చేశారు. వయస్సు పెరుగుతుండడం, వర్క్ లోడ్ కారణంగా బుమ్రా వరుసగా టెస్టుల్లో ఆడటం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్లతో జరిగే టెస్టులకే బుమ్రా పరిమితం కావచ్చని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పెద్ద లోటని అన్నారు. T20ల్లోనూ టెస్ట్ లెంగ్త్ బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే అరుదైన బౌలర్ బుమ్రా అని ప్రశంసించారు.
News March 12, 2026
సిమెంట్ రంగంపై యుద్ధ ప్రభావం.. ధరల పెంపు తప్పదా?

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఇండియాలో సిమెంట్ రంగంపైనా పడిందని ‘ఎలారా క్యాపిటల్’ సంస్థ తన నివేదికలో పేర్కొంది. గత 15రోజుల్లో ముడి చమురు 39%, థర్మల్ కోల్ 14%, పెట్ కోక్ ధరలు 18% పెరిగాయని తెలిపింది. తయారీ ఖర్చులు పెరగడంతో కంపెనీల లాభాలపై తీవ్ర ప్రభావం పడనుందని, FY27 Q2లో లాభాలు భారీగా తగ్గొచ్చని అంచనా వేసింది. ఈ భారాన్ని భర్తీ చేసేందుకు ఒక సిమెంట్ బస్తాపై ₹6 వరకు పెంచాల్సిన అవసరముందని చెప్పింది.
News March 12, 2026
చరిత్రలో ఈ రోజు (మార్చి 12)

1930: మహాత్మాగాంధీ నేతృత్వంలో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం
1962: ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి ప్రమాణ స్వీకారం
1963: సినిమా ఎడిటర్, 9 జాతీయ సినీ అవార్డులు గెలుచుకున్న అక్కినేని శ్రీకర్ ప్రసాద్ జననం
1984: సింగర్ శ్రేయా ఘోషల్ జననం
1993: ముంబైలో వరుస బాంబు పేలుళ్లు.. 257 మంది మృతి
2022: సినీ గీత రచయిత కందికొండ యాదగిరి మరణం


