News May 2, 2024

కార్పోరేట్ సరికొత్త ట్రెండ్.. ఆఫీస్ పికాకింగ్

image

కరోనాతో వర్క్ ఫ్రం‌హోమ్ అలవాటైన ఉద్యోగులను ఆఫీసు రప్పించేందుకు కార్పోరేట్ సంస్థలు కొత్త ట్రెండ్‌ను అనుసరిస్తున్నాయి. పని చేసే ప్రదేశంలో ఆహ్లాదకర వాతావరణం కల్పించి, ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించడమే ‘ఆఫీస్ పికాకింగ్’ ట్రెండ్. ఉద్యోగులను రప్పించేందుకు ఆఫీసులో ఇంటి తరహా వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. అయితే దీని వల్ల ఫ్రెషర్లు, జూనియర్ ఉద్యోగులు ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Similar News

News February 4, 2026

ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం ‘సహస్రార చక్రం’

image

తల పైభాగంలో ఉండే ఈ చక్రం ఆధ్యాత్మిక ఉన్నతికి ద్వారం. ఇది సమతుల్యంగా ఉంటే విశ్వంతో సంబంధం ఏర్పడి, అపారమైన జ్ఞానం, ఆనందం కలుగుతాయి. అస్థిరత ఏర్పడితే మానసిక ఒత్తిడి, జీవితంపై విరక్తి, ఒంటరితనం వేధిస్తాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి మౌన ధ్యానం శ్రేష్ఠమైనది. తల పైభాగంలో వెలుగు ఉన్నట్లు ఊహిస్తూ ధ్యానం చేయడం ఓంకారాన్ని పలకడం ద్వారా ఈ చక్రాన్ని సమతుల్యం చేయవచ్చు. ఇది మనిషిని దైవత్వానికి చేరువ చేస్తుంది.

News February 4, 2026

వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

image

కొన్నిచోట్ల వరి పంటలో మానిపండు తెగులు కనిపిస్తోంది. దీన్ని కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.

News February 4, 2026

CSIRలో సెక్షన్ ఆఫీసర్ పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్& ఇండస్ట్రియల్ రీసెర్చ్(<>CSIR<<>>)లో 8 సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. UPSC నిర్వహించిన CSE-2024లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి ఎంపిక కాని వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 33ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ , డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.csir.res.in/