News May 2, 2024
ఇద్దరు BRS ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు
TG: మేడ్చల్, జనగామ BRS MLAలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారి ఎన్నికలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన కోర్టు సమాధానం చెప్పాలని తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. బ్యాంక్ ఖాతా లేకపోయినా IT రిటర్న్స్ ఎలా దాఖలు చేశారని మల్లారెడ్డి ఎన్నికను కాంగ్రెస్ నేత వజ్రేశ్ సవాల్ చేశారు. జనగామ MLA పల్లా ఎన్నికపై కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పిటిషన్ వేశారు.
Similar News
News December 25, 2024
అమిత్ షా, నిర్మలతో చంద్రబాబు భేటీ
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ అయిన ఆయన కాసేపటి క్రితం కేంద్రమంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఇవాళ్టితో బాబు హస్తిన టూర్ ముగిసింది. రేపు ఆయన నేరుగా హైదరాబాద్ చేరుకోనున్నారు. అక్కడ జరిగే మంత్రి టీజీ భరత్ కూతురు వివాహానికి హాజరవుతారు.
News December 25, 2024
రామ్‍చరణ్ దంపతుల క్రిస్మస్ వేడుకలు
సెలబ్రిటీలు క్రిస్మస్‌ను కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకోవడం తెలిసిందే. నటుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు మాత్రం తమ సిబ్బందితో పండుగ వేడుకలు చేసుకున్నారు. వీరిలో వారి ఇంటి సిబ్బందితో పాటు అపోలో సిబ్బంది కూడా ఉండటం గమనార్హం. తమ వద్ద పనిచేసేవారికీ పండుగను సెలబ్రేట్ చేయడం గ్రేట్ అంటూ మెగా ఫ్యాన్స్ వారిని కొనియాడుతున్నారు.
News December 25, 2024
బాక్సింగ్ డే టెస్టుల్లో సెంచరీలు బాదింది వీరే
ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో జరిగిన బాక్సింగ్ డే టెస్టుల్లో ఐదుగురు భారత బ్యాటర్లు మాత్రమే శతకాలు నమోదు చేశారు. సచిన్ టెండూల్కర్ (1999), వీరేంద్ర సెహ్వాగ్ (2003), అజింక్య రహానే, విరాట్ కోహ్లీ (2014), చటేశ్వర్ పుజారా (2018), అజింక్య రహానే (2020) సెంచరీలు చేశారు. రహానే రెండు సార్లు శతకాలు సాధించారు. మరి రేపు ప్రారంభం కాబోయే బాక్సింగ్ డే టెస్టులో ఎవరు సెంచరీ బాదుతారో కామెంట్ చేయండి.