News May 2, 2024

హైదరాబాద్‌లో ఢిల్లీ పోలీసులు.. తీవ్ర ఉత్కంఠ

image

అమిత్‌షా వీడియో మార్ఫింగ్ కేసు విచారణకు సంబంధించి ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. టీపీసీసీ సోషల్ మీడియాకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండగా.. పలువురిని విచారిస్తారని తెలుస్తోంది. అటు ఇప్పటికే పలువురికి నోటీసులు ఇచ్చిన ఢిల్లీ పోలీసులు.. తాజాగా మరోసారి రాష్ట్రానికి రావడంతో ఏమైనా అరెస్టులు జరుగుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది.

Similar News

News March 22, 2026

పూతలపట్టు: ప్రమాదంలో మృతి చెందింది వీరే

image

పూతలపట్టు మండలం పి.కొత్తకోట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తిరుమల దర్శనానికి వెళ్తున్న కర్ణాటక రాష్ట్రం మండ్యకు చెందిన కుటుంబం ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సతీష్ (50), భాగ్యలక్ష్మి (45) అక్కడికక్కడే మృతి చెందగా, శశాంక్ (23), పవని (10), మహాలక్ష్మి (12), తుషార (4)లకు గాయాలు అయ్యాయి.

News March 22, 2026

మూడో రోజే ₹500 కోట్ల క్లబ్‌లోకి ధురంధర్-2

image

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. Sacnilk ప్రకారం ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ₹500 కోట్ల గ్రాస్ మైల్‌స్టోన్‌ని దాటింది. ఇండియాలో ₹339 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా ఓవర్సీస్ మార్కెట్‌లో ₹96 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. స్పై థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన ఈ సినిమాకు భారీ ఆక్యుపెన్సీ లభిస్తోంది.

News March 22, 2026

ENG కోచ్ మెక్‌కల్లమ్‌పై సంచలన ఆరోపణలు

image

ENG కోచ్ మెక్‌కల్లమ్‌ మద్యం, పొగ తాగే ప్లేయర్లకే ప్రయారిటీ ఇస్తారని ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. యాషెస్ సిరీస్ మధ్యలో 6 రోజులు ప్లేయర్లు మద్యం తాగినట్లు ఆరోపణలున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్లే టీమ్ ఓడినట్లు కొందరు ఆటగాళ్లు అభిప్రాయపడినట్లు సమాచారం. ECB మీటింగ్‌లో స్టోక్స్, మెక్‌కల్లమ్‌ ఒకరినొకరు నిందించుకున్నట్లూ వార్తలొస్తున్నాయి. కాగా ఆ ఆరోపణలను మెక్‌కల్లమ్‌ కొట్టిపారేసినట్లు తెలుస్తోంది.