News May 2, 2024
విడిపోయాక దూసుకెళ్తున్నాయి..!

గోద్రేజ్ గ్రూప్ రెండుగా విడిపోతున్నట్లు ఇటీవల ఆ సంస్థ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ గ్రూప్ విడిపోయాక పలు గోద్రేజ్ కంపెనీల షేర్లు దూసుకెళ్తున్నాయి. ఈరోజు వీటి షేర్ల విలువ 2-6% పెరిగింది. ఆస్టర్ లైఫ్‌సైన్సెస్ షేర్లు 6% లాభం నమోదు చేయగా గోద్రేజ్ ఆగ్రోవెట్, గోద్రేజ్ ఇండస్ట్రీస్, గోద్రేజ్ కన్జూమర్ 1-4% లాభాలు నమోదు చేశాయి. అయితే గోద్రేజ్ ప్రాపర్టీస్ షేర్ల విలువ మాత్రం 3శాతం పడిపోయింది.
Similar News
News March 12, 2026
ప్రతీకార సెగలు.. US వ్యూహం వికటించిందా?

వెస్ట్ ఏషియాలో యుద్ధం కొత్త మలుపు తిరిగింది. యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పుడు ఇరాన్ షరతులు విధిస్తోంది. మరోవైపు దాడులతో ఆశించిన ఫలితం దక్కకపోవడం, చమురు ధరలు ఎగబాకడంతో యుద్ధాన్ని కొనసాగించాలా లేదా విరమించాలా అన్న సందిగ్ధంలో అమెరికా పడింది. యుద్ధాన్ని కొనసాగించాలా లేక శాంతి చర్చలకు మొగ్గు చూపాలా అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
News March 12, 2026
చమురు సంక్షోభం.. సోలార్ స్టాక్స్‌కు జోష్

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ముడిచమురు, LPG కొరత సూచీలను డౌన్ చేస్తుంటే గ్రీన్ ఎనర్జీ స్టాక్స్ మాత్రం దూసుకెళ్తున్నాయి. సోలార్, విండ్ ఎనర్జీ స్టాక్స్‌లో భారీగా కొనుగోళ్లు పెరిగాయి. NTPC గ్రీన్ ఎనర్జీ 13.8%, సోలెక్స్ ఎనర్జీ 13%, KPI గ్రీన్ ఎనర్జీ 11.8%, సాత్విక్ ఎనర్జీ 7.9% గెయిన్ అయ్యాయి. ఇక LPG కొరత స్విగ్గీ, జొమాటో షేర్లపై ప్రభావం చూపిస్తోంది. వారం రోజుల్లో స్విగ్గీ 4.46%, జొమాటో 7% డౌన్ అయ్యాయి.
News March 12, 2026
సబ్జా గింజలతో కురులకు బలం

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.


