News May 2, 2024
ఎన్నికలంటేనే ఇన్ని హామీలు ఉండాల్సిందేనా?

ఎన్నికలంటేనే హామీల వర్షాలు. ఒక పార్టీని మించి మరో పార్టీ ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తుంటాయి. ఒక్కోసారి హామీల అమలుకు రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోని పరిస్థితి ఉంటుంది. వాస్తవానికి ప్రజలే ఇన్ని హామీలు అడుగుతున్నారా? పార్టీలే ప్రజలను హామీల ఉచ్చులో పడేస్తున్నాయా? అంటే ఎవరూ దానికి సమాధానం చెప్పలేరు. రాష్ట్రాలను సంక్షోభంలోకి నెట్టే ఈ హామీలపై మీరేమంటారు? ప్రజలకు ఏమి అవసరమో కామెంట్ చేయండి.
Similar News
News March 22, 2026
ట్రంప్ అల్టిమేటమ్.. వెనక్కి తగ్గిన ఇరాన్

అమెరికా అధ్యక్షుడు <<19445494>>ట్రంప్<<>> 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ విషయంలో వెనక్కి తగ్గింది. జలసంధి మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని కండీషన్ పెట్టింది. ఆయిల్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే విషయం. అయితే ఇరాన్ హార్ముజ్‌ను పూర్తిగా ఓపెన్ చేసేందుకు అంగీకరించకపోవడంతో గడువు పూర్తయ్యాక ట్రంప్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశమైంది.
News March 22, 2026
మహిళలకే క’న్నీటి’ కష్టాలు

నీటి కొరతతో ఎక్కువగా మహిళలు, బాలికలే ఇబ్బంది పడుతున్నట్లు యూఎన్ రిపోర్ట్ పేర్కొనడం చర్చనీయాంశమైంది. గ్లోబల్‌గా మహిళలు/బాలికలు నీటి సేకరణకే రోజుకు 25కోట్ల గంటలు వెచ్చిస్తున్నారు. నీరు సరఫరా లేని 70%కుపైగా గ్రామాల్లో నీటి బాధ్యత మహిళలదే. దీంతో వారి విద్యకు, ఆదాయానికి, ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికీ 210 కోట్లకుపైగా ప్రజలకు సురక్షిత నీరు అందడం లేదు. >నేడు ప్రపంచ నీటి దినోత్సవం.
News March 22, 2026
పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపకండి: CM

TG: పిల్లలను ప్రైవేట్ స్కూళ్లకు పంపాలనే మోజు నుంచి తల్లిదండ్రులు బయటకు రావాలని CM రేవంత్ సూచించారు. ‘వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తున్నాం. ఇవి నర్సరీ నుంచి ప్రారంభం అవుతాయి. పాలు, బ్రేక్‌ఫాస్ట్ కూడా అందిస్తాం. ప్రైవేట్ కంటే గవర్నమెంట్ టీచర్లే ప్రతిభావంతులు. అన్ని ప్రభుత్వ స్కూళ్లను ప్రక్షాళన చేస్తాం. అందుకే విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా’ అని సిద్దిపేటలో తెలిపారు.


