News May 3, 2024
‘ప్రత్యేక మేనిఫెస్టో’ విడుదల చేయనున్న కాంగ్రెస్!
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ ఆవిష్కరించనుంది. ఇవాళ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ 23 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దీనిని ఇంటింటికి ప్రచారం చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తోంది. ఈ మేనిఫెస్టోలో కొత్త ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు, ఇంటింటికి ఉచిత సోలార్ సిస్టమ్ వంటి హామీలు ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 26, 2024
శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదు: సీఎం
సినీ పరిశ్రమకు అండగా ఉంటామంటూనే ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ క్లియర్ మెసేజ్ ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదన్నారు. హీరోల ప్రభావం సమాజంపై అధికంగా ఉంటుందని, సొసైటీకి ఆదర్శంగా వారి ప్రవర్తన ఉండాలని సూచించారు. ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు నిర్మాత అల్లు అరవింద్ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. సంధ్య థియేటర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా చూసుకుంటామన్నారు.
News December 26, 2024
సినీ ప్రముఖులతో భేటీలో సీఎం ఆవేదన
TG: సినీ ప్రముఖులతో భేటీలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తొక్కిసలాటలో మహిళ ప్రాణాలు కోల్పోయిన అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిపారు. ఈ భేటీకి మంత్రులు, హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, చిక్కడపల్లి సీఐతో పాటు సినీ పరిశ్రమ నుంచి 46 మంది హాజరయ్యారు.
News December 26, 2024
కేంద్రం అనుమతిస్తే డీజిల్ టూ ఎలక్ట్రిక్ బస్సు?
TG: పాత డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. రెట్రో ఫిట్ మెంట్ పాలసీ ద్వారా మార్చేందుకు కేంద్రాన్ని సాయం కోరింది. కొత్త ఎలక్ట్రిక్ బస్సు రూ.1.50 కోట్ల పైనే ఉండటంతో ఈ వైపు ఆలోచనలు చేస్తోంది. పాత బస్సులను మార్చడం ద్వారా సంస్థపై వ్యయ భారం తగ్గే అవకాశం ఉంది. కేంద్రం దీనికి అనుమతిస్తే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్లపై తిరగనున్నాయి.