News May 3, 2024
‘ప్రత్యేక మేనిఫెస్టో’ విడుదల చేయనున్న కాంగ్రెస్!
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ప్రత్యేక మేనిఫెస్టోను కాంగ్రెస్ ఆవిష్కరించనుంది. ఇవాళ గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ 23 అంశాలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. దీనిని ఇంటింటికి ప్రచారం చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు చేస్తోంది. ఈ మేనిఫెస్టోలో కొత్త ఎయిర్ పోర్టులు, రైల్వే లైన్లు, ఇంటింటికి ఉచిత సోలార్ సిస్టమ్ వంటి హామీలు ఉన్నట్లు సమాచారం.
Similar News
News November 9, 2024
కలెక్టర్లు ఎన్యూమరేటర్లతో మాట్లాడాలి: భట్టి
TG: సమగ్ర కుటుంబ సర్వేపై ప్రజలకు తలెత్తే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని Dy.CM భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సర్వేపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష చేశారు. ‘కలెక్టర్లు ఎన్యూమరేటర్లతో నిత్యం మాట్లాడాలి. మంత్రులు, MLAలకు సమాచారం ఇవ్వాలి. దేశం మొత్తం తెలంగాణను గమనిస్తోంది. అందరూ చూపించే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకండి’ అని కోరారు.
News November 9, 2024
YCP MLA తాటిపర్తిపై కేసు నమోదు
AP: మంత్రి నారా లోకేశ్‌పై అసత్య ఆరోపణలు చేశారంటూ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం YCP MLA తాటిపర్తి చంద్రశేఖర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. సెప్టెంబర్ 18న లోకేశ్‌పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్‌కు కమీషన్లు అందుతున్నాయని ఎక్స్‌లో చంద్రశేఖర్ పోస్టు చేశారు. దీనిపై పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.
News November 9, 2024
అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్?
AP: అమరావతిలో అంతర్జాతీయ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 2 ఏళ్లలో 150 ఎకరాల విస్తీర్ణంలో దీనిని నిర్మించేందుకు ప్రయత్నిస్తోంది. కొండపల్లి, మూలపాడుతో పాటు రాజధాని ప్రాంతాల్లో కూడా స్థలాన్వేషణ చేస్తోంది. దీని బాధ్యతను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నికి అప్పగించింది. కాగా ఇటీవల సీఎం చంద్రబాబుతో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటుపై చర్చించిన సంగతి తెలిసిందే.