News May 3, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులు కావడంతో గత రెండు రోజులుగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 65,313 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,780 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.54 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News December 28, 2024
రెండు పార్టులుగా VD12 మూవీ: నాగవంశీ
గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న VD12 మూవీ రెండు పార్ట్‌లుగా రాబోతోందని నిర్మాత నాగవంశీ వెల్లడించారు. అయితే రెండు పార్టుల్లో వేర్వేరుగా కథ ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం తొలి భాగం 80 శాతం షూటింగ్ పూర్తయ్యిందన్నారు. మార్చిలో మూవీ విడుదలకు ప్లాన్ చేస్తున్నామని, ఒకవేళ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే వాయిదా వేస్తామని చెప్పారు.
News December 28, 2024
TG టెట్ అభ్యర్థులకు కీలక సూచనలు
JAN 2 నుంచి 20 వరకు టెట్ పరీక్ష జరగనుంది. ఉ.9 నుంచి 11.30 వరకు, మ.2 నుంచి 4.30 వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. అభ్యర్థులను గంటన్నర ముందే పరీక్ష కేంద్రంలో అనుమతిస్తారు. ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లను క్లోజ్ చేస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌తో పాటు బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్, గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.
News December 28, 2024
డెబ్యూ మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించిన SA ప్లేయర్
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ కోర్బిన్ బాష్ అరంగేట్ర మ్యాచ్‌లోనే రికార్డు సృష్టించారు. పాక్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన అతను 9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 81* రన్స్ చేశారు. క్రికెట్ హిస్టరీలో ఇలా మొదటి మ్యాచ్‌లోనే 4 వికెట్లు, హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. అలాగే డెబ్యూ మ్యాచ్‌లో 9వ ప్లేస్‌లో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు చేసిన ప్లేయర్‌గానూ నిలిచారు.