News May 3, 2024
మిత్రదేశాలపై బైడెన్ విమర్శలు.. శ్వేతసౌధం వివరణ

భారత్, జపాన్‌లకు వలసదారులంటే భయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో అధ్యక్ష కార్యాలయమైన శ్వేత సౌధం స్పందించింది. ‘బైడెన్ వాటిని ఎంత గౌరవిస్తారన్నది మా మిత్రదేశాలకు తెలుసు. వలసదారులు దేశానికి ఎంత కీలకమో చెప్పడమే ఆయన ఉద్దేశం. ఆ అర్థంలోనే ఆ మాటల్ని చూడాలి. జపాన్, భారత్ రెండూ మాకు కీలకం. వాటితో బలమైన సంబంధాలున్నాయి’ అని వివరించింది.
Similar News
News March 21, 2026
రాష్ట్రాలకు అదనంగా 20% కమర్షియల్ గ్యాస్

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్రం శుభవార్త చెప్పింది. రాష్ట్రాలకు అదనంగా మరో 20% కమర్షియల్ గ్యాస్ అందించనున్నట్లు ప్రకటించింది. ఈనెల 23 నుంచి ఇది అమలులోకి రానుంది. ఇటీవల కేంద్రం అనౌన్స్ చేసిన 10% గ్యాస్‌కు ఇది అదనం. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు రాసిన లేఖలో కేంద్రం పేర్కొంది.
News March 21, 2026
ఇకపై ఖర్చులు పెరుగుతాయనేది నిజం: రాహుల్ గాంధీ

రూపాయి విలువలో క్షీణత, ఇండస్ట్రియల్ డీజిల్ ధరల హైక్ దేశంలో ద్రవ్యోల్బణానికి సంకేతాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఇది మామూలేనని కేంద్రం తోసిపుచ్చినా రవాణా ఖర్చులు పెరగడం, MSMEలపై భారం, నిత్యావసర సరకుల ధరల పెంపు, FII సెల్లింగ్‌తో స్టాక్ మార్కెట్లపై భారం పడనుందనేది నిజమన్నారు. ఎన్నికల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని, దీనిని ఎదుర్కొనేందుకు మోదీ సర్కార్‌కు ప్లాన్ లేదని విమర్శించారు.
News March 21, 2026
US మినహాయింపు ఇచ్చినా ఇరాన్ ఆయిల్ రావడం కష్టమే?

చమురు కొరత నేపథ్యంలో ఇరాన్ ఆయిల్‌పై ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. ఈ క్రూడ్ కొనడానికి భారతీయ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. అయితే ఇరాన్ తమ వద్ద సర్‌ప్లస్ ఆయిల్ లేదని షాక్ ఇచ్చింది. హార్ముజ్‌ను బ్లాక్ చేసిన ఇరాన్ USపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఇలా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో భారత్‌కు ఇరాన్ ఆయిల్ రావడం ప్రశ్నార్థకమైంది. 2018లో US ఆంక్షలకు ముందు ఇరాన్ క్రూడ్ అతిపెద్ద బయ్యర్‌గా భారత్ ఉండేది.


