News May 3, 2024

మిత్రదేశాలపై బైడెన్ విమర్శలు.. శ్వేతసౌధం వివరణ

image

భారత్, జపాన్‌లకు వలసదారులంటే భయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారడంతో అధ్యక్ష కార్యాలయమైన శ్వేత సౌధం స్పందించింది. ‘బైడెన్ వాటిని ఎంత గౌరవిస్తారన్నది మా మిత్రదేశాలకు తెలుసు. వలసదారులు దేశానికి ఎంత కీలకమో చెప్పడమే ఆయన ఉద్దేశం. ఆ అర్థంలోనే ఆ మాటల్ని చూడాలి. జపాన్, భారత్‌ రెండూ మాకు కీలకం. వాటితో బలమైన సంబంధాలున్నాయి’ అని వివరించింది.

Similar News

News December 6, 2025

ఉద్యోగులకు ఆ హక్కు ఉండాలి.. లోక్‌సభలో బిల్లు

image

పని వేళలు పూర్తయ్యాక ఉద్యోగులకు వచ్చే ఆఫీసు కాల్స్‌కు సంబంధించి ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్‌సభ ముందుకు వచ్చింది. ‘Right to Disconnect Bill-2025’ను NCP ఎంపీ సుప్రియా సూలే ప్రవేశపెట్టారు. పని వేళల తర్వాత, హాలిడేస్‌లో వర్క్ కాల్స్, ఈమెయిల్స్ నుంచి డిస్ కనెక్ట్ అయ్యే హక్కు ఉద్యోగులకు ఉండాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అథారిటీని ఏర్పాటు చేయాలని కోరారు.

News December 6, 2025

టర్కీ కోళ్ల రకాలు – ప్రత్యేకతలు

image

☛ బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంజ్: ఈ టర్కీ కోళ్ల ఈకలు నల్లగా ఉండి తోక చివరి భాగంలో మాత్రం తెల్ల రంగులో ఉంటాయి.
☛ బ్రాడ్ బ్రెస్టెడ్ లార్జ్ వైట్: ఈ తెలుపు రంగు టర్కీలు భారతదేశ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయి. ఇవి వేడిని తట్టుకోగలవు. డ్రెస్సింగ్ తర్వాత శుభ్రంగా కనిపిస్తాయి.
☛ బెల్టస్విల్లే స్మాల్ వైట్: ఈ రకం టర్కీ కోళ్లకు గుడ్ల ఉత్పత్తి, గుడ్డు పొదిగే సామర్థ్యం ఎక్కువగా ఉంటుంది.

News December 6, 2025

పుతిన్‌కు ప్రధాని మోదీ ఇచ్చిన గిఫ్ట్స్ ఇవే

image

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఆయనకు కొన్ని ప్రత్యేక బహుమతులు ఇచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత కశ్మీరీ కుంకుమ పువ్వు, అస్సాంకు చెందిన ఫేమస్ బ్లాక్ టీ, మార్బుల్ చెస్ బోర్డు, మహారాష్ట్ర హస్త కళాకారులు చేత్తో చేసిన వెండి గుర్రం, ముర్షిదాబాద్‌కు చెందిన వెండి టీ కప్పుల సెట్ వంటి బహుమతులు అందజేశారు.