News May 3, 2024

నిర్మాతలే రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లు: సోనాలి బింద్రే

image

హీరో-హీరోయిన్ల మధ్య ఎఫైర్స్‌ను సినిమా నిర్మాతలే క్రియేట్ చేసేవారని హీరోయిన్ సోనాలి బింద్రే తెలిపారు. వాళ్ల సినిమా ప్రమోషన్ల కోసమే ఇలాంటివి సృష్టించేవారని పేర్కొన్నారు. ‘నాపై కూడా చాలా రూమర్స్ సృష్టించారు. కానీ వాటిలో ఒక్కటి కూడా నిజం లేదు. అప్పట్లో ఈ రూమర్స్ ట్రెండ్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉండేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోయిన్ అవుతానని నేను అప్పుడు అనుకోలేదు’ అని ఆమె చెప్పారు.

Similar News

News January 11, 2026

సంక్రాంతి సందడి.. హోటళ్లు హౌస్‌ఫుల్

image

AP: గోదావరి జిల్లాల్లో సందడి సంక్రాంతి మొదలైంది. భీమవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, కాకినాడ, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జిలు హౌస్‌ఫుల్ అయిపోయాయి. కోడిపందేల కోసం తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి జనం తరలివస్తున్నారు. పందేల బరులు భారీగా ఏర్పాటు చేస్తున్నారు. హోటల్ యజమానులు గదుల అద్దెను మూడు రోజులకు రూ.30-60 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

News January 11, 2026

తలనొప్పితో బాధపడుతున్నారా?

image

తరచూ తలనొప్పి వస్తుంటే దానికి ప్రధాన కారణం మన రోజువారీ అలవాట్లేేనని నిపుణులు అంటున్నారు. మార్నింగ్ టిఫిన్ దాటవేయడం, ఎక్కువసేపు ఆకలితో ఉండటం దీనికి ముఖ్య కారణాలు. అలాగే ఒత్తిడితో కూడిన జీవనశైలి వలన మెడ, తల కండరాలు బిగుసుకుపోయి నొప్పి వస్తుంది. తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి అకస్మాత్తుగా తలనొప్పి వస్తుంది. బరువు తగ్గాలనే ఉద్దేశంతో సరిగ్గా తినకపోయినా, నిద్ర లేకపోయినా ఈ సమస్య వస్తుంది.

News January 11, 2026

నిర్మలా సీతారామన్‌కు భట్టి విక్రమార్క కీలక విజ్ఞప్తి

image

TG: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలను తీర్చడానికి బహిరంగ మార్కెట్ ద్వారా రూ.70,925 కోట్లు సమీకరించుకునే అనుమతి ఇవ్వాలని Dy.CM భట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం వివిధ ఏజెన్సీల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంది. స్పెషల్ పర్పస్ వెహికల్ (SPV) కింద ఉన్న ఈ రుణాలను FRBM పరిధిలోకి తీసుకురావాలని అభ్యర్థించారు.