News May 3, 2024
నిర్మాతలే రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లు: సోనాలి బింద్రే
హీరో-హీరోయిన్ల మధ్య ఎఫైర్స్‌ను సినిమా నిర్మాతలే క్రియేట్ చేసేవారని హీరోయిన్ సోనాలి బింద్రే తెలిపారు. వాళ్ల సినిమా ప్రమోషన్ల కోసమే ఇలాంటివి సృష్టించేవారని పేర్కొన్నారు. ‘నాపై కూడా చాలా రూమర్స్ సృష్టించారు. కానీ వాటిలో ఒక్కటి కూడా నిజం లేదు. అప్పట్లో ఈ రూమర్స్ ట్రెండ్ ఇండస్ట్రీలో విపరీతంగా ఉండేది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోయిన్ అవుతానని నేను అప్పుడు అనుకోలేదు’ అని ఆమె చెప్పారు.
Similar News
News November 2, 2024
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల కేసు.. గ్యాంగ్‌స్టర్ తమ్ముడి కోసం వెతుకులాట
సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కేసులో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్‌ను అమెరికా నుంచి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్మోల్‌పై Maharashtra Control of Organised Crime Act (MCOCA) ప్రత్యేక కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. అతనిపై ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీచేశారు. ఎక్స్‌ట్రాడిషన్ కోసం కోర్టు పత్రాలను ముంబై పోలీసులు కేంద్రానికి పంపనున్నారు.
News November 2, 2024
ఈ యాప్ SBIది కాదు.. నమ్మకండి: PIB
నెట్ బ్యాంకింగ్ ద్వారా పొందిన రివార్డు పాయింట్లను రెడీమ్ చేసుకునేందుకు ఓ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని SBI పంపినట్లుగా APK ఫైల్‌తో కూడిన మెసేజ్ చక్కర్లు కొడుతోంది. దీనిని ఇవాళే ఇన్‌స్టాల్ చేస్తే రూ.9,980 పొందొచ్చని మెసేజ్ సారాంశం. అయితే దీనికి SBIకి సంబంధం లేదని PIB ఫ్యాక్ట్‌చెక్ పేర్కొంది. ఇలాంటివి SBI పంపించదని, దీనిని నమ్మి ఇతరులకు షేర్ చేయొద్దని అవగాహన కల్పించింది. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?
News November 2, 2024
బీఆర్ఎస్ జాతకాలు మా దగ్గర ఉన్నాయి: అసదుద్దీన్
బీఆర్ఎస్ జాతకాలు తమ దగ్గర ఉన్నాయని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవి చెబితే ఎవరూ తట్టుకోలేరని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదు. అహంకారంతోనే గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. మేం కాంగ్రెస్‌తో జత కట్టామని ఆ పార్టీ ఆరోపిస్తోంది. కానీ గతంలో మా మద్దతుతోనే మీరు గ్రేటర్ ఎన్నికల్లో గెలిచారు కదా?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.