News May 3, 2024

అమేథీని కాదని రాయ్ బరేలీకి ఎందుకు?

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీలో పోటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఆయన అమేథీలో పోటీ చేస్తారని అంతా భావించారు. కాగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాయ్ బరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. 2019లో అమేథీలో ఓడిన తర్వాత ఆ స్థానం కాంగ్రెస్‌కు చాలా దూరమైనట్లు పార్టీ భావిస్తోందని సమాచారం. మరోవైపు రాయ్ బరేలీ తన తల్లి స్థానం కావడంతో అక్కడ రాహుల్ గెలుపు నల్లేరుపై నడక అని పార్టీ విశ్వసిస్తోందట.

Similar News

News January 18, 2025

నేటి నుంచి U19 మహిళల టీ20 WC

image

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మలేషియా వేదికగా ఇవాళ్టి నుంచి జరగనుంది. మొత్తం 16 జట్లను 4 గ్రూపులుగా విభజించారు. మలేషియా, శ్రీలంక, వెస్టిండీస్, భారత్ గ్రూప్-ఏలో ఉన్నాయి. టీమ్ ఇండియా తన తొలి మ్యాచును రేపు WIతో ఆడనుంది. నేడు తొలి మ్యాచు ఆస్ట్రేలియా, స్కాట్లాండ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్‌లో చూడవచ్చు. 2023లో జరిగిన తొలి ఎడిషన్‌లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

News January 18, 2025

ఢిల్లీ ఎన్నికలు: అన్ని పార్టీలదీ అదే దారి!

image

తాము ఉచితాలకు వ్యతిరేకమని చెప్పుకునే బీజేపీ సైతం ఢిల్లీ ఎన్నికల కోసం తాయిలాలు ప్రకటించింది. ప్రతి నెల మహిళలకు రూ.2,500, గర్భిణులకు రూ.21,000 ఇస్తామని జేపీ నడ్డా ప్రకటించారు. మరోవైపు మహిళలకు కాంగ్రెస్ రూ.2,500, ఆప్ రూ.2,100 ఇస్తామని హామీలు ఇచ్చాయి. ఇలా దేశ రాజధానిలో మహిళల ఓట్ల కోసం పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఈ ఉచితాల హామీలపై మీ కామెంట్?

News January 18, 2025

శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే?

image

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటివాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.