News May 3, 2024

అమేథీని కాదని రాయ్ బరేలీకి ఎందుకు?

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథీలో పోటీ నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. ఆయన అమేథీలో పోటీ చేస్తారని అంతా భావించారు. కాగా.. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాయ్ బరేలీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. అయితే.. 2019లో అమేథీలో ఓడిన తర్వాత ఆ స్థానం కాంగ్రెస్‌కు చాలా దూరమైనట్లు పార్టీ భావిస్తోందని సమాచారం. మరోవైపు రాయ్ బరేలీ తన తల్లి స్థానం కావడంతో అక్కడ రాహుల్ గెలుపు నల్లేరుపై నడక అని పార్టీ విశ్వసిస్తోందట.

Similar News

News November 10, 2024

హౌతీలపై అమెరికా భీకర దాడులు

image

యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్‌పై అమెరికా విరుచుకుపడింది. హౌతీలకు చెందిన పలు ఆయుధ డిపోలను యూఎస్ యుద్ధ విమానాలు ధ్వంసం చేసినట్లు పెంటగాన్ తెలిపింది. అత్యాధునిక ఆయుధాలతో తాము పేల్చేసినట్లు వెల్లడించింది. కాగా ట్రంప్ అధ్యక్షుడయ్యాక హౌతీలపై ఇదే తొలి దాడి. మరోవైపు మిడిల్ ఈస్ట్‌లో శాంతి నెలకొల్పేందుకు F-15 ఫైటర్ జెట్‌తోపాటు బాంబర్స్, ట్యాంకర్, బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డెస్ట్రాయర్స్‌ను పంపింది.

News November 10, 2024

నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతోన్న ‘దేవర’

image

ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ OTTలో అదరగొడుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్‌లో ఈ సినిమా నంబర్ వన్ ట్రెండింగ్‌లో నిలిచింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించారు. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు టాక్.

News November 10, 2024

రేవంత్‌వి అన్నీ బోగస్ మాటలే: హరీశ్ రావు

image

TG: CM రేవంత్ అన్ని వర్గాలను మోసం చేశారని BRS నేత హరీశ్ రావు మండిపడ్డారు. చెప్పేవన్నీ బోగస్ మాటలేనని ఆయన విమర్శించారు. ‘రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు.. నియామకాలు లేవు, నిరుద్యోగ భృతి ఏమైంది. రూ.4 వేల పెన్షన్ రాలేదు. మహిళలకు రూ.2,500 ఏవీ? 40 లక్షల మందికి రుణమాఫీ చేశారనేది బోగస్. రైతుభరోసా అందలేదు. వరిపంటకు బోనస్ ఇవ్వలేదు. రేవంత్ అబద్ధాల ప్రచారం మహారాష్ట్రలో కూడా కొనసాగిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.