News May 3, 2024

నష్టాల ఊబిలో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 1030 పాయింట్లు నష్టపోయి 73,574కు చేరింది. మరోవైపు నిఫ్టీ 267 పాయింట్లు కోల్పోయి 22,380కి క్షీణించింది. అన్ని రంగాలు నష్టాలను నమోదు చేయడంతో అది మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. మార్కెట్ విలువ ఏకంగా రూ.2.67లక్షల కోట్లు క్షీణించి రూ.405.83లక్షల కోట్లకు చేరింది.

Similar News

News April 9, 2026

మావిగన్ జోకర్‌గా జగన్: షర్మిల

image

AP: YCP చీఫ్ <<19603764>>జగన్<<>> YSR పేరును వాడుకున్నారే తప్ప ఆయన ఆశయాలకు వారసులు కాలేదని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. ‘‘దేశంలో క్రిస్టియన్ మైనారిటీలపై దాడులు జరుగుతుంటే YSR వారసుడుగా జగన్ ఎందుకు ఖండించలేదు? 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి ప్యాలెస్‌లు కట్టుకున్నారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా మిగిలారు. మద్యపాన నిషేధమని మాట ఇచ్చి, కల్తీ మద్యం అమ్మి ‘ఓన్లీ క్యాష్’ మాఫియా ఎందుకు చేశారు’’ అని నిలదీశారు.

News April 9, 2026

సీజ్‌ఫైర్‌పై గందరగోళానికి పాకిస్థానే కారణమా?

image

పశ్చిమాసియాలో సీజ్‌ఫైర్‌పై నెలకొన్న గందరగోళానికి పాకిస్థానే కారణమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేసేటప్పుడు ఇది లెబనాన్‌కూ వర్తిస్తుందని పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ పేర్కొన్నారు. కానీ ఇది లెబనాన్‌కు వర్తించదని US, ఇజ్రాయెల్ వాదిస్తున్నాయి. మరోవైపు చర్చలు కొనసాగాలంటే లెబనాన్‌పై దాడులు ఆపాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో పాక్ సరిగ్గా సమన్వయం చేయలేదా అనే ప్రశ్న ఎదురవుతోంది.

News April 9, 2026

పవన్ ఖేరాకు HYDతో సంబంధం ఏంటి..? హిమంత తరఫు లాయర్ ప్రశ్న

image

కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ముందస్తు బెయిల్ <<19602791>>పిటిషన్‌పై<<>> TG హైకోర్టులో విచారణ జరిగింది. రాజకీయాల్లో విమర్శలు సహజమని, పరువు నష్టం కేసులో అరెస్ట్ చేయడానికి ఇంటికి వంద మందిని పంపిస్తారా? అని ఖేరా తరఫు లాయర్ సింఘ్వీ వాదించారు. ఇక ఈ కేసును విచారించే పరిధి TG HCకి లేదని అస్సాం CM హిమంత తరఫు లాయర్ దేవజిత్ అన్నారు. ఖేరా ఆధార్ అడ్రస్ ఢిల్లీలో ఉందని, ఆయనకు HYDతో ఏం సంబంధమని ప్రశ్నించారు.