News May 3, 2024

నష్టాల ఊబిలో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 1030 పాయింట్లు నష్టపోయి 73,574కు చేరింది. మరోవైపు నిఫ్టీ 267 పాయింట్లు కోల్పోయి 22,380కి క్షీణించింది. అన్ని రంగాలు నష్టాలను నమోదు చేయడంతో అది మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. మార్కెట్ విలువ ఏకంగా రూ.2.67లక్షల కోట్లు క్షీణించి రూ.405.83లక్షల కోట్లకు చేరింది.

Similar News

News February 15, 2026

‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ రచయిత మృతి.. అనుమానాలు?

image

TG: యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న అతడు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లాలోని పాలేరు జలాశయంలోకి దూసుకెళ్లింది. వెనుక భాగంలో కూర్చున్న శ్రీనివాస్ మరణించగా, డ్రైవర్ కారులో నుంచి కిందపడి అక్కడి నుంచి పరారైనట్లు మత్స్యకారులు తెలిపారు. కర్నూలు జిల్లాకు చెందిన శ్రీనివాస్ గతంలో ‘పవన్ కళ్యాణ్ హఠావో.. పాలిటిక్స్ బచావో’ అనే పుస్తకంతో చర్చనీయాంశంగా మారారు.

News February 15, 2026

CNF అంటే ఏంటో తెలుసా?

image

రైలు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు CNF అని వస్తే టికెట్ కన్ఫామ్ అయిందని అర్థం. కోచ్ నంబర్, బెర్త్ నంబర్ మీ టికెట్‌పై మెన్షన్ చేస్తారు. ఉదాహరణకు CNF/D3/18/WS అంటే D3-కోచ్ నంబర్, 18- సీట్ నంబర్, WS- విండో సీట్. IRCTC లేదా అఫీషియల్ రైల్వే సైట్‌లో PNR నంబర్ ఎంటర్ చేస్తే బుకింగ్ స్టేటస్ తెలుస్తుంది.
Share It

News February 15, 2026

సీఎంను కలిసిన విజయ్.. పెళ్లి ఇన్విటేషనేనా?

image

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నెల 26న రష్మికతో విజయ్ పెళ్లి, మార్చి 4న రిసెప్షన్ జరగనుందనే ప్రచారానికి ఈ భేటీ మరింత బలాన్ని చేకూర్చినట్లయింది. రేవంత్ రెడ్డిని తన పెళ్లి లేదా విందుకు విజయ్ ఆహ్వానించినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.