News May 3, 2024
T20WC: న్యూయార్క్‌లో హోటల్ ధరలకు రెక్కలు

టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్‌తో న్యూయార్క్‌లో హోటళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. జూన్ 9న భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుండటంతో హోటళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగాయి. ప్రస్తుతం అక్కడ కొన్ని హోటళ్లలో రూమ్స్ ధర రూ.9,422గా ఉంటే.. మ్యాచ్ ఉన్న రోజు ఈ ధర రూ.66,624గా ఉండటం గమనార్హం. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాగా హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.
Similar News
News January 31, 2026
జనవరి 31: చరిత్రలో ఈ రోజు

* 1666: మొఘల్ చక్రవర్తి షాజహాన్ మరణం
* 1905: కవి, రచయిత కందుకూరి రామభద్రరావు జననం
* 1949: ప్రజా గాయకుడు గద్దర్ జననం
* 1972: మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ మాలిక్ జననం
* 1975: బాలీవుడ్ నటి ప్రీతీ జింటా జననం
* 1997: టీమ్ ఇండియా క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ జననం
* 2009: హాస్యనటుడు నగేష్ మరణం
News January 31, 2026
సిట్ నోటీసులపై హైకోర్టుకు వెళ్లే యోచనలో కేసీఆర్?

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చిన <<19005122>>నోటీసులపై<<>> హైకోర్టుకు వెళ్లాలని మాజీ సీఎం KCR యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిట్ నోటీసులను సవాలు చేస్తూ ఈరోజు హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆదివారం (FEB 1) మ.3 గంటలకు నంది నగర్ నివాసంలో విచారిస్తామని కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చిన సంగతి తెలిసిిందే. ఎర్రవెల్లిలోనే విచారించాలన్న ఆయన అభ్యర్థనను అధికారులు తిరస్కరించారు.
News January 31, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


