News May 3, 2024

T20WC: న్యూయార్క్‌లో హోటల్ ధరలకు రెక్కలు

image

టీ20 వరల్డ్ కప్‌ ఎఫెక్ట్‌తో న్యూయార్క్‌లో హోటళ్ల ధరలకు రెక్కలొచ్చాయి. జూన్ 9న భారత్, పాక్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుండటంతో హోట‌ళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగాయి. ప్ర‌స్తుతం అక్కడ కొన్ని హోట‌ళ్ల‌లో రూమ్స్ ధ‌ర‌ రూ.9,422గా ఉంటే.. మ్యాచ్ ఉన్న రోజు ఈ ధ‌ర రూ.66,624గా ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ మ్యాచ్ టికెట్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రాగా హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.

Similar News

News December 16, 2025

IPL.. పతిరణకు రూ.18 కోట్లు

image

శ్రీలంక యంగ్ బౌలర్ మతీశా పతిరణను రూ.18 కోట్లకు KKR కొనుగోలు చేసింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ఇతడి కోసం ఢిల్లీ, లక్నో పోటీ పడ్డాయి. డెత్ ఓవర్లలో యార్కర్లు వేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టించడం పతిరణ స్పెషల్. ఇతడు గతంలో చెన్నై తరఫున ఆడారు. సౌతాఫ్రికా బౌలర్ నోర్జ్‌ను లక్నో రూ.2 కోట్లకు దక్కించుకుంది. అటు భారత స్పిన్నర్ రాహుల్ చాహర్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు.

News December 16, 2025

ఏపీపీ పోస్టులకు ఇంటర్వ్యూలు ఎప్పుడంటే?

image

AP: 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(ఏపీపీ) పోస్టుల భర్తీకి సంబంధించి డిసెంబర్ 19 నుంచి 22 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. మంగళగిరిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్ మీనా తెలిపారు.

News December 16, 2025

2026 మార్చిలోపు ATM, UPI నుంచి పీఎఫ్ విత్‌డ్రా: కేంద్ర మంత్రి

image

ATM, UPI నుంచి PF విత్‌డ్రా చేసుకునే అవకాశం మార్చి 2026లోపు అందుబాటులోకి తెస్తామని కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. ‘కారణం చెప్పకుండానే 75% వరకు పీఎఫ్ తీసుకోవచ్చు. ఆ డబ్బు మీది. అందుకే విత్‌డ్రా చేసుకునేందుకు ఇప్పటివరకు ఉన్న కఠినమైన రూల్స్‌ను సులభతరం చేస్తున్నాం. పీఎఫ్ అకౌంట్‌కు బ్యాంక్ ఖాతా లింక్ చేసుకుంటే డెబిట్ కార్డుతో ATMలో విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది’ అని చెప్పారు.