News May 3, 2024

అరకులో గెలుపు వరకు వెళ్లేదెవరు?

image

AP: అరకు పార్లమెంట్ నియోజకవర్గం(ST) 2008లో ఏర్పడింది. 2009లో కిశోర్ చంద్రదేవ్(INC), 2014లో కొత్తపల్లి గీత, 2019లో గొడ్డేటి మాధవి వైసీపీ తరఫున గెలిచారు. ఈ ఎన్నికల్లో గీత బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతుండగా, వైసీపీ నుంచి డాక్టర్ చెట్టి తనూజా రాణి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో గెలుపు బోణీ కొట్టాలని బీజేపీ, హ్యాట్రిక్ కోసం వైసీపీ ఆరాటపడుతున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 10, 2026

మీ గ్యాస్ సిలిండర్ బుక్ అవుతోందా?

image

గల్ఫ్ యుద్ధంతో మన దగ్గర గ్యాస్ సప్లైలో కొరత ఏర్పడింది. డొమెస్టిక్ సిలిండర్లు ఆన్‌లైన్‌లో బుక్ అవ్వడం లేదని కొందరు వాపోతున్నారు. 10 రోజుల కింద బుక్ చేసినా డెలివరీ చేయడం లేదని మరికొందరు ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే కొన్ని ఏజెన్సీలు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. బుకింగ్‌ సమస్య మీకూ ఎదురవుతోందా? అయితే సంబంధిత సంస్థలకు మెయిల్, ఫోన్ ద్వారా కంప్లైంట్ చేయండి.

News March 10, 2026

ఇతిహాసాల నుంచి నానుడిలు: ‘గొంతెమ్మ కోరికలు’ అంటే ఏమిటి?

image

అడగకూడని, అసంబద్ధమైన కోరికలనే ‘గొంతెమ్మ కోరికలు’ అంటారు. భారతంలో కుంతీ దేవి పేరే గొంతెమ్మగా మారింది. ఆమె కన్యగా ఉన్నప్పుడు దుర్వాసుడు ఇచ్చిన వరాన్ని పరీక్షించడం కోసం సూర్యుడిని వేడుకోగా కర్ణుడిని పుత్రుడిగా ప్రసాదిస్తారు. దీంతో ఆమె భయంతో బిడ్డను నదిలో వదిలేస్తారు. అలాగే కురుక్షేత్ర యుద్ధంలో ‘కర్ణుడు పాండవుల పక్షాన రావాలి’ అంటూ సాధ్యం కాని కోరికను శ్రీకృష్ణుడిని కోరతారు.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 10, 2026

AIతో అమ్మాయిల లవ్.. ఆందోళనలో చైనా?

image

చైనాలో యువతులు ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి ‘AI బాయ్‌ఫ్రెండ్స్’ వైపు మొగ్గు చూపుతున్నారు. సామాజిక ఒత్తిళ్లు, పెళ్లి పట్ల విరక్తితో కోట్లాది మంది ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. దేశంలో పడిపోతున్న జననాల రేటును మరింత తగ్గిస్తుందని చైనా భావిస్తోంది. దీన్ని అరికట్టేందుకు కఠిన నిబంధనలు తెచ్చింది. చాట్‌బాట్‌ల వాడకంపై టైమ్ లిమిట్, సోషల్ వాల్యూస్ బ్రేక్‌పై నిఘా పెంచింది.