News May 3, 2024
అరకులో గెలుపు వరకు వెళ్లేదెవరు?
AP: అరకు పార్లమెంట్ నియోజకవర్గం(ST) 2008లో ఏర్పడింది. 2009లో కిశోర్ చంద్రదేవ్(INC), 2014లో కొత్తపల్లి గీత, 2019లో గొడ్డేటి మాధవి వైసీపీ తరఫున గెలిచారు. ఈ ఎన్నికల్లో గీత బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతుండగా, వైసీపీ నుంచి డాక్టర్ చెట్టి తనూజా రాణి పోటీ చేస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో గెలుపు బోణీ కొట్టాలని బీజేపీ, హ్యాట్రిక్ కోసం వైసీపీ ఆరాటపడుతున్నాయి.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 10, 2024
సాల్ట్ సెంచరీ.. వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ గెలుపు
5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20ఓవర్లలో 182/9 స్కోర్ చేసింది. చేధనకు దిగిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆ జట్టు ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ 54 బంతుల్లోనే 9 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 రన్స్‌తో మెరుపు శతకం బాదారు. జాకబ్ బెథెల్(58)రాణించారు.
News November 10, 2024
వైట్‌హౌస్‌కు దూరంగా ట్రంప్ కుమార్తె, అల్లుడు!
అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలోనే ఆయన కూతురు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్ గురించి చర్చ మొదలైంది. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా పని చేసినప్పుడు ఇవాంక, కుష్నర్ వైట్‌హౌస్‌లో పని చేశారు. అయితే ఈసారి మాత్రం వాళ్లు అడ్మినిస్ట్రేషన్‌లో పాలుపంచుకునేలా కనిపించడం లేదు. వాళ్లిద్దరూ ట్రంప్ రాజకీయ ప్రచారాల్లోనూ పాల్గొనలేదు.
News November 10, 2024
దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు
AP: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.