News May 4, 2024

రాష్ట్రంలో SR ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

image

AP: 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా ప్రారంభిస్తున్న పాడేరు, మార్కాపురం, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్ కాలేజీల్లో 241 మంది సీనియర్ రెసిడెంట్ల నియమానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 44 ఏళ్లలోపు మాత్రమే ఉండాలి. జీతం రూ.70వేల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి

Similar News

News April 1, 2026

ముగిసిన నీలం సాహ్ని పదవీకాలం

image

AP: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఐదేళ్ల పదవీకాలం నిన్నటితో ముగిసింది. ఆమె స్థానంలో రిటైర్డ్ సీఎస్ నీరబ్ కుమార్‌, తదితరుల పేర్లు వినిపించినా నియామకం జరగలేదు. సాధారణ ఎన్నికలతో పాటు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలోనూ కొత్తగా రాబోయే SEC పాల్గొనాల్సి ఉంటుంది. అందుకే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న అధికారి కోసం ప్రభుత్వం అన్వేషిస్తున్నట్లు సమాచారం. 45రోజుల్లో కమిషనర్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.

News April 1, 2026

‘ఏఐ సెక్సువల్’.. ఇప్పుడు కొత్త ట్రెండ్!

image

ఆహారపు అలవాట్లు, ఇష్టాలే కాదు బంధాల్లోనూ కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే ‘ఏఐ సెక్సువల్’. లైంగిక విషయాల గురించి ఏఐతో పంచుకునే వాళ్లు వాళ్లను ‘ఏఐ సెక్సువల్’గా పేర్కొంటున్నారు. JoiAI అనే ప్లాట్‌ఫామ్ సర్వేలో 43% మంది లైంగిక సమస్యలపై, 37% మంది ఫ్లర్టింగ్/డేటింగ్‌పై, 33% సెక్స్ చాట్‌కు AIని వినియోగిస్తున్నట్లు తేలింది. గోప్యత, ఫ్రీగా మాట్లాడొచ్చనే ఏఐపై ఆధారపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.

News April 1, 2026

‘పోలవరం’ అకౌంట్లోకి డబ్బులు

image

AP: పోలవరం ప్రాజెక్టుకు రూ.1,301.61కోట్లు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ కుల్దీప్ కుమార్‌ సింగ్ రాష్ట్రానికి లేఖ రాశారు. ఆ డబ్బులు ప్రాజెక్ట్ అకౌంట్లో నేరుగా జమవుతాయని జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. డ్యామ్ పనులు, నిర్వాసితుల పరిహారం కోసం రూ.1,508కోట్లు మంజూరు చేయాలని ఇటీవల రాష్ట్ర జలవనరులశాఖ కేంద్రాన్ని కోరింది. సమీక్షించి తాజాగా నిధులు రిలీజ్ చేసింది.