News May 4, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ్టి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఓట్లు సమర్పించవచ్చు. ఈ నెల 4, 6 తేదీల్లో పీవోలు, ఏపీవోలకు ఆయా శిక్షణ కేంద్రాల వద్ద.. ఇతర అధికారులు, సిబ్బంది ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయవచ్చు. మరోపక్క 85ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుల హోమ్ ఓటింగ్ కొనసాగుతోంది.

Similar News

News April 1, 2026

AIIMS న్యూఢిల్లీలో 10 పోస్టులు

image

తాత్కాలిక ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (AIIMS) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పోస్టును బట్టి డిప్లొమా/ డిగ్రీ/MBBS/ PGతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.18,000 – 67,000గా ఉంది. అభ్యర్థుల వయసు 25-35 మధ్య ఉండాలి. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ 02.04.2026. పూర్తి వివరాలకు www.aiims.eduలో noticesలోని recruitment చూడండి.

News April 1, 2026

ఇరాన్‌పై 16వేల బాంబులు వేశాం: ఇజ్రాయెల్

image

యుద్ధం మొదలైనప్పటి నుంచి తమ వైమానిక దళం ఇరాన్‌పై 800కు పైగా విడతల్లో 16వేల బాంబులను జారవిడిచినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేసినట్లు తెలిపింది. మిలిటరీ హెడ్‌క్వార్టర్లు, అణుస్థావరాలు, మిస్సైల్ లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. 2వేలకు పైగా కీలక నాయకులు, సైనికులు, కమాండర్లను హతమార్చినట్లు పేర్కొంది.