News May 4, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ్టి నుంచి ఈ నెల 6వ తేదీ వరకు ఓట్లు సమర్పించవచ్చు. ఈ నెల 4, 6 తేదీల్లో పీవోలు, ఏపీవోలకు ఆయా శిక్షణ కేంద్రాల వద్ద.. ఇతర అధికారులు, సిబ్బంది ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయవచ్చు. మరోపక్క 85ఏళ్లు పైబడిన వృద్ధులు, 40శాతం వైకల్యం ఉన్న దివ్యాంగుల హోమ్ ఓటింగ్ కొనసాగుతోంది.

Similar News

News November 7, 2024

రేపే సీఎం రేవంత్ పాదయాత్ర

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టనున్నారు. శుక్రవారం ఉదయం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం సంగెం నుంచి భీమలింగంలోని మూసీ నది వరకు 2.5 కి.మీ మేర పాదయాత్ర చేయనున్నారు. అక్కడి నుంచి తిరిగి ధర్మారెడ్డిపల్లి కెనాల్ కట్ట వెంబడి సంగెం-నాగిరెడ్డిపల్లి రోడ్డు వరకు యాత్ర చేస్తారు. అక్కడే రథంపై నుంచి సీఎం ప్రసంగిస్తారు.

News November 7, 2024

ట్రూకాల‌ర్ ఆఫీసుల‌పై ఐటీ రైడ్స్‌

image

ప‌న్ను ఎగ‌వేత ఆరోప‌ణ‌ల‌పై ట్రూకాల‌ర్ ఆఫీసుల్లో IT అధికారులు సోదాలు నిర్వహించారు. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్ ఆఫీసుల్లో తనిఖీలు జరిపారు. ప‌న్ను ఎగ‌వేత స‌హా, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ (అనుబంధ సంస్థ‌ల మ‌ధ్య లావాదేవీలు) విష‌య‌మై అధికారులు డాక్యుమెంట్ల‌ను త‌నిఖీ చేశారు. ముంద‌స్తు నోటీసులు లేకుండా చేసిన తనిఖీలపై అధికారుల‌కు స‌హ‌క‌రించిన‌ట్టు ట్రూకాల‌ర్ సంస్థ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

News November 7, 2024

రిజర్వేషన్లను పెంచుతారా?

image

ప్రస్తుతం తెలంగాణలో బీసీల జనాభా 50% పైగా ఉంది. స్థానిక సంస్థల్లో వీరికి 29% రిజర్వేషన్ అమలవుతోంది. తాము గెలిస్తే 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో చెప్పింది. అందులో భాగంగానే ప్రస్తుత రేవంత్ సర్కారు కులగణన సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈ నెలాఖరుతో సర్వే పూర్తి కానుంది. డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. మరి కాంగ్రెస్ రిజర్వేషన్లను పెంచుతుందా? లేదా? అనేది చూడాలి.