News May 4, 2024

ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేత

image

ఉల్లి ధరల్ని నియంత్రణలో ఉంచేందుకు భారత సర్కారు ఉల్లి ఎగుమతిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఆ ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్‌ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తాజాగా పేర్కొంది. ఎగుమతి ధరను టన్నుకు రూ.45,860గా నిర్ణయించింది. నిషేధం వలన తమకు రాబడి తగ్గిందంటూ మహారాష్ట్ర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Similar News

News January 19, 2026

మాఘమాసం ప్రారంభం.. ఇవి అలవరుచుకోండి!

image

మాఘమాసం అంటే పాపాలను హరించేది అని అర్థం. ఆధ్యాత్మిక చింతనకు ఇది ఎంతో శ్రేష్ఠమైన కాలమని పండితులు అంటున్నారు. ‘విష్ణువు, సూర్య భగవానుడు, శివుడికి ఈ నెల ఎంతో ముఖ్యమైనది. ఈ మాసంలో నదీ స్నానం చేస్తే పాపాలు హరిస్తాయి. పురాణ పఠనం, జపం, దానధర్మాలు, తర్పణం, హోమం చేయడం పుణ్యప్రదం. ముఖ్యంగా నువ్వులు, అన్నదానం, వస్త్రదానం చేయడం మంచిది. ఈ నెలలో మాఘ ఆదివారం నోము, మాఘ గౌరీ నోము చేస్తారు’ అని చెబుతున్నారు.

News January 19, 2026

పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటన

image

AP: పోలవరం పనుల పురోగతిని విదేశీ నిపుణుల కమిటీ పరిశీలించనుంది. ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు ఆ బృందం పర్యటిస్తుంది. కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాలకు చెందిన అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొంటారు. ఇవాళ ప్రాజెక్టులో గ్యాప్ 1, D హిల్, G హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను పరిశీలించనున్నారు. రేపు మెయిన్ డ్యామ్‌లో గ్యాప్ 2, మెటీరియల్ నిల్వలు, 21న స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్‌ను పరిశీలిస్తారు.

News January 19, 2026

శ్రీవారి మొదటి గడప దర్శనం.. టికెట్లు బుక్ చేసుకున్నారా?

image

తిరుమల శ్రీవారిని మొదటి ద్వారం నుంచి దర్శించుకునే భాగ్యం పొందాలని ఉందా? అయితే లక్కీడిప్ ద్వారా TTD ఈ అవకాశం కల్పిస్తోంది. ఇందులో ఎంపికైన భక్తులు స్వామిని అతి చేరువ నుంచి దర్శించుకోవడమే కాక ఆయనకు నిర్వహించే పలు సేవల్లోనూ పాల్గొనవచ్చు. ఏప్రిల్ నెలకు సంబంధించి రిజిస్ట్రేషన్లకు ఎల్లుండి చివరి గడువు. లక్కీడిప్‌లో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.