News May 4, 2024
కేసీఆర్ ఏ కూటమిలో చేరతారు?: సీఎం రేవంత్

కేసీఆర్ కేంద్రంలోని ఏ కూటమిలో చేరతారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ బీజేపీతో కలుస్తారని మేం ముందునుంచీ చెబుతున్నాం. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. కేసీఆర్ వైఖరిని ప్రజలు ముందే గుర్తించారు. అందుకే వారిని దూరం పెట్టారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసింది. ఈ పదేళ్లలో ఆ పార్టీ రాష్ట్రానికి ఒక్క మేలైనా చేసిందా? రాహుల్‌ను పీఎంగా చూడాలనేదే ప్రజల ఆకాంక్ష’ అని తెలిపారు.
Similar News
News March 14, 2026
పటాన్‌చెరు: పరీక్ష కోసం తల్లిదండ్రుల మరణ వార్తను దాచారు!

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గన్యచక్ర తండాకు చెందిన సోములు, మంగమ్మ దంపతులు <<19379117>>పటాన్‌చెరు<<>>లో హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా హత్యకు గురైన తల్లిదండ్రుల విషయం తెలిస్తే బాలిక పరీక్షపై ప్రభావం పడుతుందని భావించిన గ్రామస్థులు, పరీక్ష పూర్తయ్యే వరకు విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. పరీక్ష ముగించుకుని ఇంటికి వచ్చిన బాలికకు విషయం తెలిసి కన్నీరుమున్నీరయ్యింది.
News March 14, 2026
రోహిత్‌కు హార్దిక్ వార్నింగ్?.. MI రియాక్షన్ ఇదే

ఈ ఏడాది IPL ప్రారంభానికి ముందు రోహిత్ శర్మకు MI కెప్టెన్ హార్దిక్ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఓ స్పోర్ట్స్ అకౌంట్ ట్వీట్ చేసింది. హిట్ మ్యాన్ ప్రదర్శన సరిగా లేకపోతే సహించేది లేదని పాండ్య మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు పేర్కొంది. దీనిపై MI స్పందించింది. ‘ఏమైనా రాసుకోవచ్చు’ అనే అర్థంలో నవ్వుతున్న ఎమోజీని పోస్టు చేసింది. ఇలాంటి రూమర్స్‌ను పుట్టించడం సాధారణమై పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
News March 14, 2026
సులభంగా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు

LPG సిలిండర్ బుకింగ్ కోసం కాల్స్ కలవక ఇబ్బంది పడుతున్నారా? అయితే పెట్రోలియం శాఖ సూచించిన ఈ 5 సులభమైన పద్ధతులు పాటించండి. వినియోగదారులు WhatsApp, SMS/IVRS, మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా కేవలం ఒక <<19377800>>మిస్డ్‌కాల్<<>> ద్వారా గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. మీ గ్యాస్ ప్రొవైడర్‌ను బట్టి ఏయే నంబర్లు, యాప్ వాడాలో పైనున్న ఫొటోలో చెక్ చేసుకోవచ్చు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి UPI యాప్స్‌లోనూ బుక్ చేసుకోవచ్చు.


