News May 4, 2024

కేసీఆర్ ఏ కూటమిలో చేరతారు?: సీఎం రేవంత్

image

కేసీఆర్ కేంద్రంలోని ఏ కూటమిలో చేరతారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా డిమాండ్ చేశారు. ‘కేసీఆర్ బీజేపీతో కలుస్తారని మేం ముందునుంచీ చెబుతున్నాం. బీఆర్ఎస్, బీజేపీ ఒకటే. కేసీఆర్ వైఖరిని ప్రజలు ముందే గుర్తించారు. అందుకే వారిని దూరం పెట్టారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసింది. ఈ పదేళ్లలో ఆ పార్టీ రాష్ట్రానికి ఒక్క మేలైనా చేసిందా? రాహుల్‌‌ను పీఎంగా చూడాలనేదే ప్రజల ఆకాంక్ష’ అని తెలిపారు.

Similar News

News December 6, 2025

580 మార్కులు సాధిస్తే విమాన విహారం: ఎమ్మెల్యే సురేంద్రబాబు

image

పదో తరగతిలో 580 మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి నారా లోకేశ్ వద్దకు తీసుకువెళ్లి విమాన విహారానికి అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలిపారు. కళ్యాణదుర్గం మోడల్ స్కూల్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మెగా టీచర్స్, పేరెంట్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

News December 6, 2025

ASF: మైనర్ కిడ్నాప్.. చివరికి

image

మైనర్ బాలికను అపహరించి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు సాయి చరణ్ రెడ్డికి 35ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. 2013లో నమోదైన ఈ కేసులో పీపీఈ శ్రీనివాస్, దర్యాప్తు అధికారుల వాదనలు ఆధారంగా శిక్ష ఖరారైంది. బాధితురాలికి న్యాయం జరిగేలా పనిచేసిన అధికారులను ఎస్పీ నితికా పంత్ అభినందించారు.

News December 6, 2025

పుతిన్ భారత పర్యటనపై చైనా మీడియా ఏమందంటే..?

image

భారత్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనపై చైనా మీడియా స్పందించింది. 2 దేశాలు ఒంటరిగా లేవని ప్రపంచానికి పంపిన సందేశమని ‘గ్లోబల్ టైమ్స్’ చెప్పింది. ‘భారత్, రష్యా తమ సామర్థ్యాలను సొంతంగా, మరింతగా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. 2 దేశాల మధ్య సమన్వయం, సహకారమే ఇందుకు నిదర్శనం. US, వెస్ట్ ఆంక్షలు ఫలించవు’ అని ఫారిన్ అఫైర్స్ వర్సిటీ ప్రొఫెసర్ లీ హైడాంగ్ చెప్పారని తెలిపింది.