News May 5, 2024

ఆ బెత్తం దెబ్బలు ఇప్పటికీ గుర్తొస్తాయి: CJI

image

నేపాల్‌లో జరుగుతున్న ‘జువైనల్ జస్టిస్’ సదస్సులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ తన బాల్యాన్ని గుర్తుచేసుకున్నారు. ‘ఉపాధ్యాయుల ప్రవర్తన పిల్లల మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది. అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు మా టీచర్ బెత్తంతో కొట్టడంతో నా చేయి కందిపోయింది. కొద్దిరోజులకు గాయ తగ్గినా ఆ సంఘటన ఇప్పటికీ ఏదైనా పని చేస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది’ అని CJI చెప్పారు.

Similar News

News December 29, 2024

పాక్ చేతిలో భారత టెస్టు ఛాంపియన్‌షిప్ భవిష్యత్తు

image

భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అర్హత ఇప్పుడు పాక్ చేతిలో ఉంది. PAKvsSA మ్యాచ్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో 148 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. మూడోరోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు స్కోరు 27/3గా ఉంది. మిగిలిన 121 రన్స్ చేస్తే టెస్టు ఛాంపియన్ షిప్‌కి సౌతాఫ్రికా అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 2 టెస్టులు శ్రీలంకతో ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఓడితేనే భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

News December 29, 2024

సీఎం రేవంత్‌కు హరీశ్ బహిరంగ లేఖ

image

TG: కంది రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు CM రేవంత్‌కి లేఖ రాశారు. ‘మేనిఫిస్టోలో, వరంగల్ రైతు డిక్లరేషన్‌లో కందులకు మద్దతు ధరతో పాటు అదనంగా రూ.400 బోనస్ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు వాటి ఊసు లేదు. రైతులు ప్రతి క్వింటాలు కందులకు రూ.800 నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసి, మద్దతుధరను రైతులకు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

News December 29, 2024

నితీశ్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి: గవాస్కర్

image

తాను ఎక్కడి నుంచి వచ్చానన్న సంగతిని నితీశ్ కుమార్ రెడ్డి ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలని క్రికెట్ దిగ్గజం గవాస్కర్ సూచించారు. ‘ఇది నితీశ్‌కు తొలి సెంచరీ. మున్ముందు ఇలాంటి మరెన్నో సాధిస్తారు. భారత క్రికెట్‌కు ఇప్పుడు అతనో స్టార్. కానీ ఎప్పుడూ క్రికెట్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. కుటుంబం తన కోసం చేసిన త్యాగాలను మరచిపోకూడదు. మూలాల్ని మరచిపోకుండా ఉంటే అతడికి ఉజ్వలమైన కెరీర్ ముందుంది’ అని పేర్కొన్నారు.