News December 29, 2024

పాక్ చేతిలో భారత టెస్టు ఛాంపియన్‌షిప్ భవిష్యత్తు

image

భారత్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ అర్హత ఇప్పుడు పాక్ చేతిలో ఉంది. PAKvsSA మ్యాచ్‌లో ఆఖరి ఇన్నింగ్స్‌లో 148 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా బరిలోకి దిగింది. మూడోరోజు స్టంప్స్ సమయానికి ఆ జట్టు స్కోరు 27/3గా ఉంది. మిగిలిన 121 రన్స్ చేస్తే టెస్టు ఛాంపియన్ షిప్‌కి సౌతాఫ్రికా అర్హత సాధిస్తుంది. ఆస్ట్రేలియాకు ఇంకా 2 టెస్టులు శ్రీలంకతో ఉన్న నేపథ్యంలో సౌతాఫ్రికా ఓడితేనే భారత్‌కు ఫైనల్‌కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది.

Similar News

News January 22, 2025

వాముతో లాభాలెన్నో!

image

వాములో చాలా ఔష‌ధ గుణాలున్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని న‌మ‌ల‌డం వ‌ల్ల నోట్లోని బ్యాక్టీరియా న‌శించడంతో పాటు చిగుళ్ల వాపులు తగ్గుతాయి. రోజూ తీసుకుంటే శ‌రీర మెట‌బాలిజం పెరిగి బ‌రువు త‌గ్గుతారు. వాములోని యాంటీ స్పాస్మోడిక్ గుణాలు క‌డుపునొప్పి, అజీర్తికి దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తాయి. జ‌లుబు ఉన్న‌వారు వాముగింజలను పొడి చేసి వ‌స్త్రంలో చుట్టి వాస‌న పీల్చితే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

News January 22, 2025

హార్దిక్, నేను మంచి ఫ్రెండ్స్: SKY

image

హార్దిక్ పాండ్యా, తాను మంచి స్నేహితులం అని సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ‘చాలా కాలంగా కలిసి క్రికెట్ ఆడుతున్నాం. గ్రౌండ్‌లోనే కాకుండా బయటా మేము మంచి ఫ్రెండ్స్. IPL ప్రారంభం కాగానే కెప్టెన్సీ అతనికి అప్పగించి కాస్త రిలాక్స్ అవుతా’ అని సూర్య అన్నారు. ఇంగ్లండ్‌తో T20లకు హార్దిక్‌ను కాదని అక్షర్‌ను VCగా నియమించడంతో హార్దిక్, సూర్య మధ్య విబేధాలు ఉన్నాయనే వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో SKY స్పందించారు.

News January 22, 2025

కేజ్రీవాల్‌పై బీజేపీ ‘చునావీ హిందూ’ ఎటాక్

image

రామాయణంలోని ఓ అంశాన్ని ఆప్ అధినేత కేజ్రీవాల్ తప్పుగా చెప్పడంపై ఢిల్లీ ఎన్నికల వేళ BJP ఆయనపై ఎటాక్ చేస్తోంది. ‘చునావీ(ఎన్నికల) హిందూ’ అంటూ విమర్శిస్తోంది. ఆయన సనాతన ధర్మాన్ని కించపరిచారని ఢిల్లీ BJP అధ్యక్షుడు V. సచ్‌దేవా మండిపడ్డారు. ఎన్నికలప్పుడే ఆయనకు ఆలయాలపై ప్రేమ పుట్టుకొస్తుందని ఎద్దేవా చేశారు. BJP నేతలు రావణుడిని ఇష్టపడుతున్నారని, వారి స్వభావం అలాంటిదే అని కేజ్రీవాల్ ఎదురుదాడికి దిగారు.