News May 5, 2024
FLASH: పంజాబ్‌పై CSK విజయం
ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై 28 పరుగుల తేడాతో CSK విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన PBKS 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 రన్స్ మాత్రమే చేయగలిగింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ 30, శశాంక్ సింగ్ 27 మినహా అందరూ విఫలమయ్యారు. జడేజా 3, సిమర్‌జీత్ సింగ్, తుషార్ చెరో రెండు వికెట్లు, శాంట్నర్, శార్దూల్ చెరో వికెట్ తీశారు.
Similar News
News December 27, 2024
ఆ రోజున సెలవు రద్దు
TG: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా ఫిబ్రవరి 8న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 13న భోగి, 14న సంక్రాంతికి జనరల్ హాలిడేస్ ఇచ్చింది. 15న కనుమ పండుగను ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. సెలవుల జాబితా కోసం ఇక్కడ <
News December 27, 2024
మన్మోహన్ లెగసీని కొనసాగిస్తాం: CWC
దేశంలో సంస్కరణలకు పునాది వేసి రాజకీయ, ఆర్థిక రంగాల్లో మన్మోహన్ సింగ్ గణనీయమైన ప్రభావాన్ని చూపారని CWC కొనియాడింది. మాజీ ప్రధాని గౌరవార్థం సమావేశమైన CWC ఆయన నాయకత్వమే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపిందని కీర్తించింది. ఆయన లెగసీని కొనసాగిస్తామని తీర్మానించింది. శనివారం ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తరలించనున్నారు.
News December 27, 2024
నోట్ల రద్దుపై మన్మోహన్ ఏమన్నారంటే..
నోట్ల రద్దును మాన్యుమెంటల్ డిజాస్టర్‌గా మన్మోహన్ అభివర్ణించారు. నల్లధనాన్ని వెలికితీయడానికే నోట్ల రద్దు చేశామని చెప్పిన మోదీ, మొత్తం కరెన్సీ నల్లధనమని- మొత్తం నల్లధనం కరెన్సీ రూపంలో ఉందనే తప్పుడు ఊహ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ చర్య ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తుందని అనాడు మన్మోహన్ చెప్పినట్టే రూపాయి విలువ ఈ రోజు జీవిత కాల కనిష్టానికి చేరుకుందని నిపుణులంటున్నారు.