News December 27, 2024

మన్మోహన్ లెగసీని కొనసాగిస్తాం: CWC

image

దేశంలో సంస్క‌ర‌ణ‌ల‌కు పునాది వేసి రాజ‌కీయ, ఆర్థిక రంగాల్లో మ‌న్మోహ‌న్ సింగ్ గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావాన్ని చూపార‌ని CWC కొనియాడింది. మాజీ ప్ర‌ధాని గౌర‌వార్థం సమావేశమైన CWC ఆయ‌న నాయ‌క‌త్వ‌మే క్లిష్ట ప‌రిస్థితుల్లో దేశాన్ని ముందుకు న‌డిపింద‌ని కీర్తించింది. ఆయ‌న లెగ‌సీని కొన‌సాగిస్తామ‌ని తీర్మానించింది. శ‌నివారం ఉద‌యం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్యాల‌యానికి మ‌న్మోహ‌న్ భౌతిక‌కాయాన్ని త‌ర‌లించ‌నున్నారు.

Similar News

News January 13, 2025

‘గేమ్ ఛేంజర్’ యూనిట్‌కు బెదిరింపులు.. కేసు నమోదు

image

‘గేమ్ ఛేంజర్’ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీక్ కావడం వెనుక 45 మందితో కూడిన బృందం ఉందంటూ మూవీ యూనిట్ HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీళ్లే తమ చిత్రంపై సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని పేర్కొంది. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే లీక్ చేస్తామంటూ విడుదలకు 2 రోజుల ముందే చిత్ర బృందంలోని కీలక వ్యక్తులను బెదిరించినట్లు ఆధారాలను సమర్పించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

News January 13, 2025

నారావారిపల్లెలో సీఎం బిజీబిజీ

image

AP: సంక్రాంతి వేడుకల కోసం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు అక్కడ బిజీబిజీగా గడుపుతున్నారు. రూ.3 కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి, రూ.2 కోట్లతో రోడ్లు, రూ.కోటితో జడ్పీ హైస్కూల్ అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు మహిళల ముగ్గుల పోటీలు, చిన్నారుల ఆటల పోటీలు తిలకించి, విజేతలకు బహుమతులు అందించారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

News January 13, 2025

జోరుగా కోడి పందేలు.. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు

image

AP: ఉభయ గోదావరి జిల్లాల్లో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. ఎక్కడికక్కడ బరులు సిద్ధం చేసి నిర్వాహకులు పందేలు నిర్వహిస్తున్నారు. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పందేల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలైన TG, TN, కర్ణాటక నుంచి కూడా చాలామంది ఆసక్తితో కోడిపందేల కోసమే గోదావరి జిల్లాలకు రావడం విశేషం.