News May 5, 2024
ఏ ఒక్క పథకమూ ఆగదు: చంద్రబాబు
AP: కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క పథకమూ ఆపమని చంద్రబాబు భరోసా ఇచ్చారు. సూపర్ సిక్స్, మోదీ హామీలు చూసి జగన్‌కు నిద్రపట్టడం లేదన్నారు. అన్నమయ్య(D) అంగళ్లులో ప్రజాగళం సభలో మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల మెడకు ఉరితాడు. మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎర్రచందనం, మైనింగ్, ఇసుక మాఫియా నడుస్తోంది. ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచేశారు. ఇలాంటి పాలకులు మనకు అవసరమా?’ అని ప్రశ్నించారు.
Similar News
News December 27, 2024
ఆ రోజున సెలవు రద్దు
TG: 2025 ఏడాదికి సంబంధించి సాధారణ, ఆప్షనల్ సెలవుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించింది. దీనికి బదులుగా ఫిబ్రవరి 8న రెండో శనివారం పనిదినంగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 13న భోగి, 14న సంక్రాంతికి జనరల్ హాలిడేస్ ఇచ్చింది. 15న కనుమ పండుగను ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. సెలవుల జాబితా కోసం ఇక్కడ <
News December 27, 2024
మన్మోహన్ లెగసీని కొనసాగిస్తాం: CWC
దేశంలో సంస్కరణలకు పునాది వేసి రాజకీయ, ఆర్థిక రంగాల్లో మన్మోహన్ సింగ్ గణనీయమైన ప్రభావాన్ని చూపారని CWC కొనియాడింది. మాజీ ప్రధాని గౌరవార్థం సమావేశమైన CWC ఆయన నాయకత్వమే క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని ముందుకు నడిపిందని కీర్తించింది. ఆయన లెగసీని కొనసాగిస్తామని తీర్మానించింది. శనివారం ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తరలించనున్నారు.
News December 27, 2024
నోట్ల రద్దుపై మన్మోహన్ ఏమన్నారంటే..
నోట్ల రద్దును మాన్యుమెంటల్ డిజాస్టర్‌గా మన్మోహన్ అభివర్ణించారు. నల్లధనాన్ని వెలికితీయడానికే నోట్ల రద్దు చేశామని చెప్పిన మోదీ, మొత్తం కరెన్సీ నల్లధనమని- మొత్తం నల్లధనం కరెన్సీ రూపంలో ఉందనే తప్పుడు ఊహ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ చర్య ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తుందని అనాడు మన్మోహన్ చెప్పినట్టే రూపాయి విలువ ఈ రోజు జీవిత కాల కనిష్టానికి చేరుకుందని నిపుణులంటున్నారు.