News May 5, 2024
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌లో తీవ్ర గందరగోళం
APలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు ఓటేసేందుకు ఫెసిలిటేషన్ కేంద్రాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఓటు ఇక్కడ లేదంటూ ఆయా కేంద్రాల సిబ్బంది చెప్పడంతో చాలా మంది ఓటు హక్కు కోల్పోయారు. తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎక్కడుందో స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపించారు. కాగా ఈ నెల 7,8 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్లకు మరో అవకాశం కల్పించారు.
Similar News
News December 27, 2024
నోట్ల రద్దుపై మన్మోహన్ ఏమన్నారంటే..
నోట్ల రద్దును మాన్యుమెంటల్ డిజాస్టర్‌గా మన్మోహన్ అభివర్ణించారు. నల్లధనాన్ని వెలికితీయడానికే నోట్ల రద్దు చేశామని చెప్పిన మోదీ, మొత్తం కరెన్సీ నల్లధనమని- మొత్తం నల్లధనం కరెన్సీ రూపంలో ఉందనే తప్పుడు ఊహ నుంచి ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ చర్య ఆర్థిక వ్యవస్థను ఛిద్రం చేస్తుందని అనాడు మన్మోహన్ చెప్పినట్టే రూపాయి విలువ ఈ రోజు జీవిత కాల కనిష్టానికి చేరుకుందని నిపుణులంటున్నారు.
News December 27, 2024
UPI పేమెంట్లు చేసే వారికి శుభవార్త
UPI చెల్లింపులపై RBI శుభవార్త చెప్పింది. ఇకపై థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్(PPI) వ్యాలెట్లలోని సొమ్ముతో చెల్లింపులు చేసే అవకాశం కల్పించింది. ఇప్పటివరకు PPI సంస్థకు చెందిన UPI ద్వారానే ఈ తరహా పేమెంట్లకు అవకాశం ఉంది. తాజా నిర్ణయంతో ఫోన్‌పే, పేటీఎం సహా పలు వ్యాలెట్లలోని మొత్తాన్ని ఇతర యాప్‌ల్లోనూ వాడుకోవచ్చు. దీంతో గిఫ్ట్, డిజిటల్ వ్యాలెట్లు వాడే వారికి ఈజీ అవుతుంది.
News December 27, 2024
2025లో గ్రహణాలు ఎప్పుడంటే!
రానున్న ఏడాదిలో 2 సూర్య, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడనున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడుతుంది. ఇది మన దేశంలో కనిపించదు. US, వెస్ట్రన్ యూరప్, ఆఫ్రికాలో దర్శనమిస్తుంది. మార్చి 29న ఏర్పడే పాక్షిక సూర్య గ్రహణం కూడా స్వదేశంలో కనిపించదు. Sep 7-8 మధ్య ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం మాత్రమే భారత్‌లో కనిపిస్తుంది. Sep 21న పాక్షిక సూర్యగ్రహణాన్ని కూడా మనం చూసే అవకాశం ఉండదు.