News December 27, 2024

2025లో గ్ర‌హ‌ణాలు ఎప్పుడంటే!

image

రానున్న ఏడాదిలో 2 సూర్య‌, 2 చంద్ర గ్ర‌హ‌ణాలు ఏర్ప‌డ‌నున్నాయి. సంపూర్ణ చంద్రగ్ర‌హ‌ణం మార్చి 14న ఏర్ప‌డుతుంది. ఇది మన దేశంలో క‌నిపించ‌దు. US, వెస్ట్ర‌న్ యూర‌ప్, ఆఫ్రికాలో ద‌ర్శ‌న‌మిస్తుంది. మార్చి 29న ఏర్ప‌డే పాక్షిక‌ సూర్య గ్ర‌హ‌ణం కూడా స్వదేశంలో క‌నిపించ‌దు. Sep 7-8 మ‌ధ్య ఏర్ప‌డే సంపూర్ణ చంద్ర గ్ర‌హ‌ణం మాత్రమే భార‌త్‌లో కనిపిస్తుంది. Sep 21న పాక్షిక సూర్యగ్ర‌హ‌ణాన్ని కూడా మనం చూసే అవ‌కాశం ఉండ‌దు.

Similar News

News January 20, 2025

పని నాణ్యతే ముఖ్యం: భారత్ పే సీఈఓ

image

వారంలో 90 గంటలు పనిచేయడమనేది చాలా కష్టమని భారత్ పే CEO నలిన్ నెగీ తెలిపారు. వర్క్ అవర్స్ కంటే ఎంత నాణ్యతతో పని చేశామనేదే ముఖ్యమన్నారు. ఉద్యోగి ఒత్తిడితో కాకుండా సంతోషంగా పనిచేస్తేనే సంస్థకు లాభమని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.

News January 20, 2025

DANGER: రోజూ ఒకే సమయానికి నిద్ర పోవట్లేదా?

image

చాలామంది ఉద్యోగులు షిఫ్టుల వల్ల నిత్యం ఒకే సమయానికి నిద్రపోరు. దీన్నే ‘సోషల్ జెట్‌లాగ్’ అంటారు. ఒక వారంలో నిద్రపోయే సమయాల్లో 90 నిమిషాలు తేడా వస్తే శరీరంలో మైక్రోబయోటా జాతులు ఉత్పత్తి అవుతాయని సైంటిస్టులు గుర్తించారు. అలాంటివారికి ఎక్కువగా చిప్స్, షుగరీ ఫుడ్స్‌ తినాలనిపిస్తుందని తెలిపారు. ఫలితంగా సరైన ఆహారం తీసుకోలేకపోవడం, ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ ముప్పు తలెత్తవచ్చని సైంటిస్టులు తేల్చారు.

News January 20, 2025

ఇన్ఫోసిస్‌లో జీతాలే పెరగవు.. మాజీ ఉద్యోగి పోస్ట్ వైరల్

image

ఇన్ఫోసిస్‌లో శాలరీ హైక్ చాలా తక్కువని సంస్థ మాజీ ఉద్యోగి తెలిపారు. 9 ఏళ్లు పనిచేసి 2017లో రిజైన్ చేసేనాటికి తన జీతం రూ.35 వేలు మాత్రమేనన్నారు. వేరే టెక్ కంపెనీలో చేరగా 4 ఏళ్లలో నెల వేతనం రూ.1.75 లక్షలకు చేరిందని చెప్పుకొచ్చారు. క్యాబ్, పార్కింగ్ వంటి సదుపాయాలు కూడా ఇన్ఫోసిస్‌లో ఉండేవి కావన్నారు. ప్రస్తుత కంపెనీలో ఎన్నో సౌకర్యాలు ఉన్నాయని రెడిట్‌లో ఆయన చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.