News May 6, 2024

ఏపీ DGPగా ద్వారకా తిరుమలరావు?

image

AP: రాష్ట్ర నూతన DGPగా RTC MD ద్వారకా తిరుమలరావు నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1990 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన తిరుమలరావు సీనియార్టీ జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. ఆయన తర్వాత రోడ్ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్ అంజనా సిన్హా, సీనియర్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ సైతం డీజీపీ రేస్‌లో ఉన్నారు. ఈ ముగ్గురూ కాకుంటే హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్ కుమార్ గుప్తా పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

Similar News

News January 5, 2025

అప్పులకు సిద్ధమవుతున్న రాష్ట్రాలు

image

జనవరి-మార్చి త్రైమాసికంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు రూ.4.73 లక్షల కోట్ల అప్పులు తీసుకోనున్నాయి. ఇందులో ఏపీ రూ.11వేల కోట్లు, తెలంగాణ రూ.30వేల కోట్ల అప్పులు చేయనున్నాయి. ప్రభుత్వాలతో ఇటీవల సంప్రదింపుల అనంతరం RBI ఈ వివరాలను ప్రకటించింది. జనవరిలో రూ.1.47 లక్షల కోట్లు, ఫిబ్రవరిలో రూ.1.51 లక్షల కోట్లు, మార్చిలో రూ.1.74 లక్షల కోట్ల రుణాలను సమీకరించనున్నాయి.

News January 5, 2025

భారత్‌కు షాక్

image

ఆస్ట్రేలియా ముందు 162 రన్స్ టార్గెట్ ఉంచిన భారత్.. ఆశలన్నీ స్టార్ బౌలర్ బుమ్రాపైనే పెట్టుకుంది. కానీ నిన్న గాయపడ్డ అతడు ఇవాళ బ్యాటింగ్‌కు వచ్చినా బౌలింగ్‌కు రాలేదు. అతడి ప్లేస్‌లో అభిమన్యు ఈశ్వరన్‌ ఫీల్డింగ్‌కు వచ్చారు. ఇక సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో AUS ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లలోనే 35 రన్స్ చేశారు. దీంతో భారత్ పరాజయం లాంఛనమే కానుందా?

News January 5, 2025

వ్యవసాయ సీట్లకు రేపు స్పాట్ కౌన్సెలింగ్

image

TG: వ్యవసాయ, ఉద్యాన, ఫిషరీస్ డిగ్రీ కోర్సుల్లో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు HYD రాజేంద్రనగర్‌లోని కాలేజీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈఏపీసెట్-2024లో ర్యాంకు సాధించి, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావొచ్చు. వివరాలకు www.pjtsau.edu.inను చూడండి.