News January 5, 2025
భారత్‌కు షాక్
ఆస్ట్రేలియా ముందు 162 రన్స్ టార్గెట్ ఉంచిన భారత్.. ఆశలన్నీ స్టార్ బౌలర్ బుమ్రాపైనే పెట్టుకుంది. కానీ నిన్న గాయపడ్డ అతడు ఇవాళ బ్యాటింగ్‌కు వచ్చినా బౌలింగ్‌కు రాలేదు. అతడి ప్లేస్‌లో అభిమన్యు ఈశ్వరన్ ఫీల్డింగ్‌కు వచ్చారు. ఇక సిరాజ్, ప్రసిద్ధ్ బౌలింగ్‌లో AUS ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. 3 ఓవర్లలోనే 35 రన్స్ చేశారు. దీంతో భారత్ పరాజయం లాంఛనమే కానుందా?
Similar News
News January 17, 2025
ఫొటోలతో అనుబంధాన్ని వ్యక్తపరిచారు!
సంసార జీవితం పదికాలాల పాటు సాగాలంటే ఆ జంట మధ్య అన్యోన్యత పరిఢవిల్లాలి అని చెబుతుంటారు. అయితే, ఆ అన్యోన్యత ఎలా చూపించాలనే దానికి ఓ జంట కొత్త అర్థాన్ని చూపింది. 12 ఏళ్ల క్రితం కలిసిన ఈ జంట ఏటా ఓ ఫొటో దిగుతూ వారి మధ్య ఉన్న అన్యోన్యతను చూపుతూ వచ్చింది. వీరిద్దరికీ ఓ పాప జన్మించగా ఆమెతోనూ ఫొటోకు పోజులిస్తూ వచ్చారు. ఇలా ఒక్క మాట మాట్లాడకుండా వారి మధ్య ఉన్న బంధాన్ని వ్యక్తపరిచారు.
News January 17, 2025
ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రతిపాదనలు సిద్ధం చేయండి: CBN
AP: పేదలకు ఇళ్ల స్థలాలపై క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ‘పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’ అని అధికారులకు సూచించారు. అలాగే రానున్న ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా అమలుకు సిద్ధం కావాలని చెప్పారు. ఇక పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం వెంటనే ప్రారంభిస్తామని సీఎం వెల్లడించారు.
News January 17, 2025
ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు: షర్మిల
AP: ‘ఏరుదాటేదాక ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’ తీరుగా CBN వ్యవహారం ఉందని APCC చీఫ్ షర్మిల మండిపడ్డారు. సూపర్ సిక్స్ అంటూ ఆర్భాటం చేసి ఇప్పుడు ఆదాయం పెరగాలంటున్నారని దుయ్యబట్టారు. హామీలు ఇచ్చే ముందు రాష్ట్రానికి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయని తెలియదా? అని ప్రశ్నించారు. ఆడలేక మద్దెల దరువన్నట్లుగా చంద్రబాబు తీరు ఉందన్నారు. ఏపీకి ఏమాత్రం సహకరించని మోదీతో పొత్తు ఎందుకని Xలో నిలదీశారు.