News May 7, 2024
IPL 2024 ట్రోఫీ CSK గదిలో చూడాలి: పతిరణ
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ మతిశా పతిరణ తొడ కండరాల గాయం కారణంగా IPL 2024 సీజన్ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో జట్టుకు వీడ్కోలు పలుకుతూ ఆయన స్పెషల్ ట్వీట్ చేశారు. ‘2024 IPL ఛాంపియన్ ట్రోఫీని త్వరలోనే CSK గదిలో చూడాలనే ఏకైక కోరికతో జట్టుకు వీడ్కోలు పలుకుతున్నా. చెన్నై నుంచి నేను పొందిన ప్రేమ, ఆశీర్వాదాలకు CSK మేనేజ్మెంట్‌కు కృతజ్ఞతలు’ అని పతిరణ పేర్కొన్నారు.
Similar News
News January 4, 2025
బుమ్రా ఖాతాలో మరో ఘనత!
భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో ఘనత చేరింది. ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. నిన్న ఖవాజాను ఔట్ చేసిన జస్ప్రీత్, ఈరోజు లబుషేన్‌ను ఔట్ చేసి సిరీస్‌లో వికెట్ల సంఖ్యను 32కు పెంచుకున్నారు. ఈక్రమంలో 46 ఏళ్ల క్రితం బిషన్ సింగ్ బేడీ నెలకొల్పిన రికార్డు తిరగరాశారు. భారత బౌలింగ్ భారం మొత్తాన్ని బుమ్రా ఒక్కరే మోస్తుండటం గమనార్హం.
News January 4, 2025
కెనడాలో పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్
దేశవిదేశాల్లో పుష్ప-2 రికార్డుల మోత కొనసాగిస్తోంది. తాజాగా కెనడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్లను అధిగమించింది. కెనడాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూవీ రూ.1800కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే.
News January 4, 2025
మళ్లీ బండి సంజయ్‌కే టీబీజేపీ పగ్గాలు?
TG: రాష్ట్రంలో బీజేపీ పగ్గాల్ని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కే మరోమారు ఇవ్వాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీని సంజయ్ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. కాగా.. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల ఉన్నారు.