News May 7, 2024
సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటే?
అధిక నిధులు ఉన్న దేశ ప్రభుత్వాలు సావరిన్ వెల్త్ ఫండ్స్‌ను నిర్వహిస్తాయి. తమ సంపదను పెంచుకునేందుకు SWF రూపంలో విదేశాలు/సంస్థల్లో పెట్టుబడులు పెడతాయి. తొలి SWF 1953లో కువైట్‌లో ప్రారంభం కాగా ప్రస్తుతం 176 SWFలు ఉన్నాయి. భారత్‌లో 2015లో నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) పేరుతో SWF ప్రారంభమైంది. కువైట్, UAE, సింగపూర్ తదితర దేశాలు కీలక పెట్టుబడిదారులుగా ఉన్నాయి.
Similar News
News January 7, 2025
అందరూ వెళ్లిపోయారు.. కానీ మోదీ ఆట ఇంకా నడుస్తోంది: బీజేపీ
2014 నుంచి ఇప్పటి దాకా పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఓడినవారు కొందరైతే, వివిధ కారణాలతో తప్పుకున్నవారు ఇంకొందరు. ఇలా మోదీ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక US మొదలుకొని ఆస్ట్రేలియా వరకు ఎందరో దేశాధినేతలు పదవుల నుంచి తప్పుకున్నారు. తాజాగా కెనడా PM జస్టిన్ ట్రూడో కూడా. దీంతో ‘అందరూ వెళ్లిపోయారు, కానీ PM మోదీ ఆట ఇంకా నడుస్తోంది. Ultimate Big Boss Energy!’ అంటూ BJP పేర్కొంది.
News January 7, 2025
రాష్ట్ర ప్రభుత్వాల ‘ఆర్థిక పరిమితుల’పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
ఏ పనీ చేయని వ్యక్తులకు ఉచితాలు ఇవ్వడానికి రాష్ట్రాల వద్ద డబ్బులు ఉంటాయని, అదే జడ్జిలకు జీతాలు, పెన్షన్లు చెల్లించాలంటే పరిమితులపై మాట్లాడుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘ఎన్నికలొస్తే మహిళలకు ₹2500 ఇస్తామంటూ పథకాలు ప్రకటిస్తారు. వైవిధ్యమైన న్యాయ వ్యవస్థను ఏర్పరచాలంటే కొత్త ప్రతిభను ప్రోత్సహించడానికి న్యాయమూర్తుల ఆర్థిక స్వతంత్రత అనివార్యం’ అని జస్టిస్ గవాయ్ బెంచ్ పేర్కొంది.
News January 7, 2025
hMPV: ఆంక్షలు విధించిన తొలి జిల్లా
హ్యూమన్ మెటాన్యూమోవైరస్ కేసులతో నీలగిరి జిల్లా (TN) అప్రమత్తమైంది. కర్ణాటక, కేరళ సరిహద్దులున్న ఈ జిల్లాలో ఊటీ సహా పలు పర్యాటక ప్రాంతాలున్నాయి. దీంతో ప్రజల, పర్యాటకుల భద్రత దృష్ట్యా ఫ్లూ లక్షణాలున్న వారు మాస్కు ధరించడాన్ని కలెక్టర్ తన్నీరు లక్ష్మీభవ్య తప్పనిసరి చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక సర్వైలెన్స్ టీమ్‌లను రంగంలోకి దింపడంతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులతో తనిఖీలు చేస్తామన్నారు.