News May 9, 2024
ఔరా.. ఏమా వీర విధ్వంసం..!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ జోరు చూసి ప్రత్యర్థి బౌలర్లు గజగజ వణికిపోతున్నారు. వారి వీర విధ్వంసం ముందు చేష్టలుడిగిపోతున్నారు. లక్నోతో మ్యాచ్‌లో 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఉఫ్‌మని ఊదేశారు. కేవలం 47 నిమిషాల్లోనే పని కానిచ్చేశారు. విధ్వంసక బ్రదర్స్‌గా పేరున్న హెడ్-అభిషేక్ కలిసి ఈ సీజన్‌లో 934 రన్స్ బాదేశారు. వీరిద్దరి స్ట్రైక్ రేట్ 200కుపైనే ఉండడం విశేషం.
Similar News
News January 8, 2025
ALERT.. ఇవాళ రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రతలు
TG: ఇవాళ రాత్రి ఉష్ణోగ్రతలు ఈ నెలలోనే కనిష్ఠానికి పడిపోతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. రేపు ఉదయం నార్త్ HYDలో 5-7 డిగ్రీ సెల్సియస్, వెస్ట్ HYDలో 7-9 డిగ్రీ సెల్సియస్ నమోదవుతుందని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణలోని ఇతర జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.
News January 8, 2025
తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్లు బంద్: క్రాషైన కంపెనీ షేర్లు
TGకి కింగ్‌ఫిషర్ సహా <<15097668>>బీర్ల<<>> సరఫరాను సస్పెండ్ చేయడంతో యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇంట్రాడేలో 4% మేర పతనమయ్యాయి. 2019 నుంచి కనీస ధరలను పెంచకపోవడమే ఇందుకు కారణం. TG నుంచి రూ.900 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటం వర్కింగ్ క్యాపిటల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 6 నెలలుగా చెల్లింపులు చేయలేదన్న సమాచారం ఎక్స్‌ఛేంజీలకు చెప్పడంతో రూ.1920 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేర్లు చివరికి రూ.73నష్టంతో రూ.2001 వద్ద ముగిశాయి.
News January 8, 2025
మోదీజీ అమరావతికి రండి: సీఎం చంద్రబాబు
AP: మోదీని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో నిత్యం ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని సీఎం ఆహ్వానించారు. ఏ సమస్య చెప్పినా మోదీ వెంటనే అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారని కొనియాడారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, ఇందుకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.