News January 8, 2025

తెలంగాణలో కింగ్‌ఫిషర్ బీర్లు బంద్: క్రాషైన కంపెనీ షేర్లు

image

TGకి కింగ్‌ఫిషర్ సహా <<15097668>>బీర్ల<<>> సరఫరాను సస్పెండ్ చేయడంతో యునైటెడ్ బ్రూవరీస్ షేర్లు ఇంట్రాడేలో 4% మేర పతనమయ్యాయి. 2019 నుంచి కనీస ధరలను పెంచకపోవడమే ఇందుకు కారణం. TG నుంచి రూ.900 కోట్ల బకాయిలు రావాల్సి ఉండటం వర్కింగ్ క్యాపిటల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. 6 నెలలుగా చెల్లింపులు చేయలేదన్న సమాచారం ఎక్స్‌ఛేంజీలకు చెప్పడంతో రూ.1920 వద్ద కనిష్ఠాన్ని తాకిన షేర్లు చివరికి రూ.73నష్టంతో రూ.2001 వద్ద ముగిశాయి.

Similar News

News January 23, 2025

ఎయిర్‌పోర్టులో ఇంత తక్కువ ధరలా!

image

విమానాశ్రయాల్లోని కేఫ్‌లలో అధిక ధరలుంటాయన్న విమర్శలున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఉడాన్ యాత్రి కేఫ్‌‌లను ఏర్పాటు చేసింది. ఇందులో టీ కేవలం రూ.10, వాటర్ బాటిల్ రూ.10, కాఫీ రూ.20కే విక్రయిస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని కేఫ్‌లో ధరలు చూసి ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. కాగా, ఎయిర్‌పోర్టుల్లో వాటర్ బాటిల్ కూడా రూ.100కు అమ్ముతున్నారని గత నెలలో ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో సమస్యను లేవనెత్తారు.

News January 23, 2025

హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్ విస్తరణ

image

హైదరాబాద్ పోచారంలో ఐటీ క్యాంపస్ విస్తరణకు అంగీకరిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపట్టనుండగా, దీని ద్వారా 17వేలకు పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబుతో భేటీలో ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో సంగ్రాజ్ ఈ మేరకు వెల్లడించారు.

News January 23, 2025

ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో విలన్‌గా వరుణ్ తేజ్ అంటూ ప్రచారం

image

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం వైరలవుతోంది. ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సందీప్ స్క్రిప్ట్ రెడీ చేశారని, వరుణ్‌కు తన క్యారెక్టర్ గురించి వివరించారని అంటున్నారు. దీనిపై చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.