News May 9, 2024

BRS అందుకే ఓడిపోయింది: జగన్

image

AP: గత పదేళ్లలో తెలంగాణ ప్రజలకు అందించిన సంక్షేమాన్ని BRS ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయిందని.. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమిపాలైందని CM జగన్ అన్నారు. BRS కంటే ఎక్కువ చేస్తామని కాంగ్రెస్ చెప్పడంతో ఆ పార్టీని ప్రజలు నమ్మారని పేర్కొన్నారు. ‘ప్రస్తుతం AP ప్రజల ముందు రెండే ఆప్షన్లు ఉన్నాయి. విలువలు, విశ్వసనీయతకు ఓటేస్తారా? అబద్ధాలకు ఓటేస్తారా? అనేది వారే నిర్ణయించుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News January 8, 2025

మోదీజీ అమరావతికి రండి: సీఎం చంద్రబాబు

image

AP: మోదీని స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో నిత్యం ముందుకెళ్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. త్వరలో అమరావతికి రావాలని మోదీని సీఎం ఆహ్వానించారు. ఏ సమస్య చెప్పినా మోదీ వెంటనే అర్థం చేసుకుంటారని, వెంటనే పనులు జరిగేలా చొరవ చూపిస్తారని కొనియాడారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంత చొరవ తీసుకోలేదని పేర్కొన్నారు. నదుల అనుసంధానం తమ లక్ష్యమని, ఇందుకు కేంద్రం సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

News January 8, 2025

ఎన్డీయే బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది: సీఎం చంద్రబాబు

image

AP: దేశం అభివృద్ధి చెందాలంటే ఎన్డీయే సర్కారు ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఎన్డీయే బలంగా ఉంటే భారతదేశం బలంగా ఉంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ డిజిట్ వృద్ధి ఉండాలి. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తే రెండంకెల అభివృద్ధి, పేదరిక నిర్మూలన సాధ్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నా. పేదరికాన్ని రూపుమాపి, ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తాం. ఇక నుంచి అన్నీ జయాలే. అపజయాలుండవు’ అని ధీమా వ్యక్తం చేశారు.

News January 8, 2025

దక్షిణ కోస్తా రైల్వే జోన్: సాకారమైన కల

image

AP: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల డిమాండ్ ఎట్టకేలకు నెరవేరింది. వైజాగ్ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్‌కు ప్రధాని మోదీ ఈరోజు శంకుస్థాపన చేశారు. దీంతో దక్షిణ మధ్య రైల్వేకు అత్యధికంగా ఆదాయం అందించే దక్షిణ కోస్తా ఏర్పాటు లైన్ క్లియర్ అయింది. కొత్త రైళ్లు, మార్గాలు, ప్రాజెక్టులు మరింత సుగమం కానున్నాయి. ఆర్ఆర్‌బీ, రైల్వే ఆస్పత్రి, శిక్షణ, వర్క్‌షాపులు ఏర్పాటుతో ప్రజలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.